London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

అమరావతి విధ్వంసం

తెలుగుజాతికి జగన్‌ ద్రోహం

. రాజధానిని నిర్మించి ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం
. ఉపాధి కల్పన, సంపద సృష్టికి ఇది కేంద్రం
. అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : గత ఐదేళ్లలో అమరావతి రాజధానిని విధ్వంసం చేసి రాష్ట్రానికి అంచనాలకందనంత నష్టం చేకూర్చి తెలుగుజాతికి జగన్‌ తీరని ద్రోహం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో జగన్‌ లాంటి వ్యక్తిత్వం ఉన్న వారు తప్ప ఇంకెవరూ రాజధాని మార్పు నిర్ణయాన్ని తీసుకోరని, విధ్వంసానికి జగన్‌ ఒక కేస్‌ స్టడీగా సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో పుష్కలంగా వనరులు ఉన్నాయి…తెలివి తేటలు గల మానవ వనరులున్నాయి. పెట్టుబడుల కోసం ప్రపంచం వ్యాప్తంగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అలాంటి రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు విధ్వంసంతో నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో రాజధాని అమరావతిపై బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. సీఎం మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరుగుతుందని, ఇక్కడ రాజధాని కట్టాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదు. కాని రాష్ట్రానికి ఎటు చూసినా అమరావతి మధ్యలో ఉంటుంది. రాజధానికి రెండు వైపులా 12 చొప్పున పార్లమెంట్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. విభజన అనంతరం శివరామృష్ణ కమిటి రాష్ట్రంలో పర్యటిస్తే…కృష్ణా, గుంటూరు లేదా ఆ రెండు జిల్లాల మధ్య రాజధాని ఉండాలని ఎక్కువ మంది తమ అభిప్రాయాలను చెప్పారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 34,400 ఎకరాలను రైతులు ముందుకొచ్చి ఉచితంగా భూములిచ్చారు. జగన్‌ కూడా రాజధాని రాష్ట్రం నడిమధ్యలో రాజధాని ఉండాలని అసెంబ్లీలో అన్నారు. నేను ఇల్లు కట్టుకున్నా… మీరు కట్టుకోలేదు అని నన్ను అన్నారు. కానీ తర్వాత ఎలా మాటలు మార్చారో అంతా చూశాం. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఏఐఐబీ, జెఐసీఏ వంటి సంస్థలు ఆర్థిక తోడ్పాటుకు ముందుకు వచ్చాయి. సింగపూర్‌ తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. దేశంలోనే స్మార్ట్‌ సిటీగా, ప్రపంచ స్థాయి నగరంగా ఆర్థిక రాజధానిగా అమరావతి విజన్‌ రూపొందించాం. పరిశ్రమలతో పాటు ఉద్యోగాల కల్పన కేంద్రంగా నిర్ణయించాం. రూ.51,687 కోట్లతో రాజధానులకు అంచనా వేసి రూ.41,170 కోట్లకు టెండర్లు పిలిచాం. అప్పటికి జరిగిన నిర్మాణాలకు గాను రూ.4,318 కోట్లు బిల్లులు చెల్లించాం…రూ.1,268 కోట్లు ఇప్పటికీ పెండిరగులో ఉన్నాయని చంద్రబాబు వివరించారు.
జగన్‌ అధికారంలోకి రాగానే రాజధానిలో అన్ని నిర్మాణాలను మధ్యలోనే నిలిపేశారు. వ్యవసాయ కూలీలకు అందించాల్సిన పెన్షన్లు, రైతులకు ఇవ్వాల్సిన కౌలు నిలిపేశారు. మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేశారు. రూ.వెయ్యి కోట్లు గ్రాంట్‌ రాకుండా కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేశారు. సింగపూర్‌ కన్సార్టియంపైనా ఆరోపణలు చేశారు. 14 ఎకరాల్లో 12 టవర్లతో నిర్మాణం తలపెట్టిన హ్యాపీ నెస్ట్‌ ను నాశనం చేశారు. రాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. పెట్టుబడి దారుల్లో నమ్మకం సన్నగిల్లింది. సంపద సృష్టి పడిపోయింది. చిన్నపాటి ఉపాధికి కూడా పక్క రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చింది. అన్ని రంగాలు రివర్స్‌ అయ్యాయి. హైకోర్టు, హెచ్‌ఓడీ, సచివాలయాలకు సంబంధించిన ఐకానిక్‌ పునాదులన్నీ నీళ్లలో ముంచారు. 2019లో ఎక్కడున్న పనులు ఐదేళ్ల పాటు అక్కడే ఉన్నాయని చంద్రబాబు వెల్లడిరచారు. గత పాలకులు బూడిద చేసిన ప్రాంతం నుండే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతాం. ప్రజా రాజధాని ఏ ఒక్కరి కోసమో కాదు. ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన అమరావతి వల్లే సాధ్యం అవుతుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారికి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. రాజధాని పునర్నిర్మాణంపై కేంద్ర సహాయంతో ప్రతి తెలుగుబిడ్డ గర్వించే ప్రపంచస్థాయి నగరంగా గత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం నిర్మాణాలు కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img