బిజెపి నాయకుడు డోల రాజారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని 28వ వార్డు ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న గుర్రం కృష్ణమ్మ అనే మహిళ గుండెపోటుతో మృతి చెందింది. సమాచారాన్ని మంత్రి కార్యాలయ సిబ్బంది, బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి వారి కుటుంబానికి సత్య కుమార్ యాదవ్ తరఫున సంతాపం తెలుపుతూ ఆ కుటుంబానికి తమ వంతుగా 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం డోలా రాజారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు అన్నివేళలా సత్య కుమార్ యాదవ్ అండదండలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.