Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మోదీ విధానాలతో రైతన్న కుదేలు

దేశంలో ‘‘రైతే రాజన్న’’ పూర్వ వైభవం పునరుద్ధరణ జరగాలి. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయశాస్త్ర నిపుణులతో సమాలోచనలు చేసి, రైతు ప్రయోజనాలను పరిరక్షించే, వ్యవసాయాన్ని లాభసాటి చేసే నిర్ధిష్ట కార్యక్రమాన్ని రూపొందించాలి. దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రపంచీకరణ, వాణిజ్యశకంలో రైతుల సమస్యలు, వ్యవసాయం ప్రపంచ ఆర్థికవ్యవస్థ కేంద్రస్థానాన్ని సంతరించు కొన్నాయి. వ్యవసా యాన్ని లాభసాటి చేసే దిశలో ప్రాథమికంగా చర్యలు నిలిచి పోయిన వాస్తవం నిరాకరించలేనిది. అభివృద్ధి చెందిన దేశాలు వారి రైతులకు, వ్యవసాయ రంగానికి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పెద్దఎత్తున సబ్సిడీలను అందిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ పరిస్థితిలేదు. సమానా వకాశాలు వుండాలని, సబ్సిడీల క్రమబద్ధత అవసరమని అభివృద్ధి చెందు తున్న దేశాలు కోరుతుండగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తమ చట్ట వ్యతిరేక అధికారాన్ని వదులుకోవడానికి సంపన్న దేశాలు ఏమాత్రం అంగీకరించడంలేదు. సమర్థవంతమైన పద్ధతిలో వాణిజ్యాన్ని సరళీకరించడానికి బదులుగా, వాణిజ్యంలో మరింత స్వీయరక్షణ వాదులుగా ఆ దేశాలు మారి పోయాయి. మనదేశంలో రైతుల ఆత్మహత్యల సమస్య ఎప్పుడు లేవనెత్తినా కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసి, రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించిన అంశమైనందున ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టివేస్తోంది. ఇది బాధ్యతల నుంచి వైదొలిగి చేతులు దులుపుకొనే వైఖరి తప్ప మరొకటి కాదు. రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి కూడా భిన్నమైనది. వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించిన అంశమని భారత రాజ్యాంగం చెబుతున్న మాట వాస్తవమే. రైతుల ప్రయోజనాలు కాపాడవలసిన బాధ్యత ప్రభు త్వానిది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక వంటిది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందినట్లయితే, దేశ ఆర్థిక వ్యవస్థ మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు సాగుతుంది. లాభసాటి వ్యవసాయానికి రైతులకు సరసమైన ధరలకు ఉపకరణాలు లభించ వలసిన అవసరం వుంది. హామీతో కూడిన నీటి పారుదల సౌకర్యాలు అందు బాటులో వుండాలి. ఎరువులు, పురుగు మందులు అందుబాటు ధరలకు లభ్యం కావాలి. అదే విధంగా, భూమి దున్నడానికి చిన్న యాంత్రికనాగళ్లు, సంప్రదాయ ట్రాక్టర్లు అందుబాటు ధరలకు లభించాలి. వీటికి తోడుగా నిరంతర విద్యుత్‌ సరఫరా వుండాలి. గరిష్ఠ స్థాయిలో భూసారం కాపాడుకోవాలి. ఇందుకు సంబంధించి భూ ఆరోగ్య కార్డు ఎంతో ఉపయుక్తమైన చర్య. లాభసాటి వ్యవసాయం వినియోగ దారులకు మాత్రమే కాకుండా, ప్రపంచ మార్కెట్‌లో పోటీ ధరలకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి, ఎగుమతిదారులకు కూడా దోహదపడుతుంది.
రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. 2024 వచ్చినా కార్యరూపందాల్చలేదు. ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో ప్రధానికే తెలియాలి. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకర విధానాలు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి బదులు వారిని మరింత కుదేలు చేస్తున్నాయి. నరేంద్రమోదీ 2014లో గద్దెనెక్కిన తరువాత అనుసరించిన విధానాలు రైతాంగంలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. ఫలితంగా 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ సీట్లు గణనీయంగా తగ్గి పోయాయి. మోదీ పాలనలో వ్యవసాయం రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు నానాటికీ క్షీణించిపోతున్నాయి. దేశ జనాభాలో 45 శాతం మందికి పైగా ప్రజానీకం నేటికి జీవనోపాధికోసం వ్యవసాయం పైనే ఆధారపడుతున్నారు. వ్యవసాయ రంగం సమస్యలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. చిన్న, సన్నకారు, కౌలు రైతుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రైతాంగానికి ఏమాత్రం గిట్టుబాటుగాలేని పాలకుల నయా విధానాల వల్లే వారు పదేపదే రుణగ్రస్తులవుతున్నారు. రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న రుణసాయం కూడా అత్యల్పమే. ప్రభుత్వ, వాణిజ్య, సహకార బ్యాంకులన్నీ కలుపుకున్నా కూడా రైతుకు కావాల్సిన పెట్టుబడుల్లో 50 శాతం కూడా వ్యవసాయ రుణాలుగా మంజూరు చేయడంలేదు. వ్యవసాయరంగానికి ప్రభుత్వం అందిస్తున్న రుణాలలో అత్యధిక భాగం ధనిక రైతులకే కేటాయిస్తు న్నారు. చిన్న, సన్న కారు, కౌలు రైతులకు లభించే రుణం నామమాత్రమే. దానితో ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారస్తుల విషకౌగిలిలో పేద రైతులు నలిగిపోతున్నారు. రుణాల వసూలులో వీరి నిర్బంధాలు, అవమానాలు ఇన్నీఅన్నీకావు. ప్రభుత్వం మాత్రం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేయాల్సిందంతా చేస్తోంది. అరకొర సాయాన్ని అందిస్తూ దానినే ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోంది. ఆందోళనలు, నిరసనల సందర్భంగా రైతులు లేవనెత్తిన అనేక సమస్యలకు ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. రైతుల సమస్యల పరిష్కారంలో ఉదాసీనత కనబర్చే మోదీ ప్రభుత్వం అరకొర సాయంతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది తప్ప అన్నదాతకు చేసిన మేలు శూన్యం. మోదీ ప్రభుత్వం 2019 సెప్టెంబరులో వ్యవసాయ భూమి వున్న వారందరికి రూ.3 వేలు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమును ప్రకటించింది. ఈ పథకం కింద, రైతులు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 3000 కనీస భరోసా పెన్షన్‌ పొందుతారు. రైతు మరణిస్తే, రైతు జీవిత భాగస్వామి పెన్షన్‌లో 50% కుటుంబ పెన్షన్‌గా పొందేందుకు అర్హులు. ఈ పెన్షన్‌ పథకం కోసం ఇప్పటి వరకు 23.38 లక్షల మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారని ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో వ్యవసాయ మంత్రి అర్జున్‌ ముందా తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో రైతులు అనుభవిస్తున్న దానితో పోల్చినట్లయితే ఇది కేవలం రైతులకు కంటి తుడుపు ప్రయోజనమే. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం వ్యవసాయం చేస్తున్న భూ యజమానులకు మాత్రమే. కానీ దేశంలోని అనేక మంది భూ యజమానులు వ్యవసాయం చేయనివారు. వాస్తవంగా వ్యవసాయం చేసేది కౌలుదారులు. వారు ఈ పెన్షన్‌ పథకం కింద అర్హులు కాదు. కాంట్రీబ్యూటరీ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ కూడా వుంది. దాన్ని కూడా హేతుబద్ధీకరించవలసిన అవసరం వుంది. సరసమైన ధరలకు ఉపకరణాలతో పాటు రైతుకు ముఖ్యంగా కావలసింది తాను పండిరచే ఉత్పత్తులకు హుందాతో కూడిన ధర. ప్రకృతి ప్రకోపించి దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా, వరద బీభత్సం సంభవించినప్పటికీ దేశ ప్రజలకు ఆహారాన్ని అందించడానికి రైతు ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటాడు. కానీ రైతులు పండిరచిన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లభించక పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్ని కాదు. వారు పండిరచిన ఉల్లిపాయలు, టమోటాలు తదితర ఉత్పత్తులను రోడ్లపై పారేసిన ఉదాహరణలు కోకొల్లలు. ప్రభుత్వం కనీస మద్దతు ధర మాత్రమే ప్రకటిస్తుంది. అయితే, ప్రభుత్వ సంస్థ ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) రైతులు పండిరచే అన్ని పంటలు సేకరించాలి. గోధుమలు, బియ్యం, తృణధాన్యాలను మాత్రమే ఎఫ్‌సీఐ సేకరిస్తుంది. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో నాఫెడ్‌ కూడా మార్కెట్‌లో జోక్యం చేసుకొంటుంది. దేశ వ్యాప్తంగా స్పందనతో కూడిన వ్యవసాయ మార్కెట్‌ ప్రాతిపదిక సౌకర్యాలను నెలకొల్పటం, గ్రామీణ గిడ్డంగులు, కొన్ని గ్రామాల సమూహంగా శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసి రైతుల కొనుగోలు శక్తిని ప్రోత్సహించటం నేటి తక్షణావశ్యకత. అనిశ్చిత పరిస్థితిలో ఆదుకోవడానికి వీలుగా జిల్లా పరిషత్‌ల పర్యవేక్షణలో దేశంలోని ప్రతి జిల్లాలో ధాన్యపు బ్యాంకులను నెలకొల్పవలసిన అవసరం వుంది. రైతుల ఆదాయం రెట్టింపు సాకారం కావాలంటే భౌతికంగా జాతీయ వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటుకు ప్రధాని చర్యలు చేపట్టి రైతుల ప్రయోజనాలను కాపాడవలసిన అవసరం ఎంతైనా వుంది. ఆ దిశగా ప్రధాని అడుగులు వేస్తారని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img