London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

కబ్జా కి కాదేది అనర్హం…

చెరువులు, కుంటలు, కొండలు, గుట్టలు ఏవైనా సరే కబ్జా చేసేస్తాం…
పట్టాలు తెచ్చుకుంటాం,….
విశాలాంధ్ర – చిలమత్తూర్ రూరల్ : మండల వ్యాప్తంగ విపరీతముగా ఎస్ ఈ జెడ్ భూములు రైతుల వద్ద నుండి అతి తక్కువ ధరలకే పోవడంతో కొంతమంది రియాల్టర్లు ఏకముగా చెరువులు, కుంటలు, కొండలు, గుట్టలు ఏవైనా సరే కబ్జాకి కాదేది అనర్హం అన్నట్లుగా కొనసాగుతుంది ఈ వ్యవహారం, చెరువు, కుంటల, వంక పోరంబోకులు మునుగడ ప్రాంతాలు సైతం ఆక్రమించుకొని యదేచ్ఛగా సొంతం చేసుకుంటున్నారు, అంతటితో ఆగకుండా తాము సాగులో ఉన్నామంటూ రెవిన్యూ రికార్డులలో సాగుదారుడుగా ఎంట్రీ చేయించుకొని పట్టాలు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, పలువురు నాయకలైతే ఏకముగా చెరువు మునగడ ప్రాంతాలను రిజిస్ట్రేషన్లు చేయించుకొని పట్టాలు తెచ్చుకొని కంచులు వేసుకున్న సంఘటనలు కూడా లేకపోలేదు, అయితే కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను రియల్ టర్లు తమ ఆధీనములోకి తీసుకొనే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, మండల వ్యాప్తంగా 9 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 65 చిన్న కుంటలు ఉన్నాయి, మండలంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో, వాస్తవంగా( ఎఫ్ టి ఎల్) (ఫుల్ ట్యాంక్ లెవెల్) ఉన్న ప్రాంతంలో ఎటువంటి సాగు చేయడానికి లేక పోయినప్పటికీ యదేచ్చగా సాగు చేస్తున్నారు. చెరువులే కదా ఏముందిలే అన్నట్లుగా ఈ మండలంలోని కొంతమంది రియల్ టర్లు, నాయకులు ఆక్రమించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇదే జరిగితే కోట్లాది రూపాయలు విలువచేసే చెరువులు కుంటలు కొండలు గుట్టలు ప్రాంతాల సైతం వీరు ఆక్రమించుకునే ప్రమాదం పొంచి ఉంది. వీరికి ప్రభుత్వ కార్యాలయాలలో వత్తాసుగా రెవిన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి భూముల చిట్టా వెల్లడిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img