London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

నాణ్యత గల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యం..

ఆరోగ్యశాఖ మంత్రి సత్య

విశాలాంధ్ర ధర్మవరం: రాష్ట్రంలోని పేద ప్రజలకు నాణ్యత గల వస్తువులను అతి తక్కువ ధరతో పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మెయిన్ బజార్లో గల కిరాణా మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వినియోగదారుల వ్యవహారములు ఆహార పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సరసమైన ధరలలో నాణ్యమైన సరుకుల అమ్మకం అనే కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి కంది బ్యాళ్లు,, బియ్యము నాణ్యతను ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి తో పాటు మంత్రి కూడా పరిశీలించారు. ప్రజలందరికీ అతి తక్కువ ధరలో ఉన్న ఈ నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని అసోసియేషన్ వారికి సూచించారు
అనంతరం సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ పేదలకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని, సామాజిక భద్రత లో అందరికీ వివిధ రకాలుగా పెన్షన్లను కూడా ఒకేరోజు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రతినెల 1వ తేదీనే పెన్షన్ల దారుల ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వము యొక్క ప్రజా సంక్షేమం పట్ల ప్రజలు కూడా అర్థం చేసుకున్నారని తెలిపారు. ప్రజాహిత కార్యక్రమంలో భాగంగానే బియ్యమును కందిబేలును తక్కువ ధరకు ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి పౌరసరఫరాల శాఖ మంత్రి కి సత్య కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. కిరాణా మర్చంట్ వారు పేద ప్రజలకు తక్కువ ధరలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం అనేది గర్వించదగ్గ విషయమని తెలుపుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఇసుకను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని కేవలం రవాణా ఖర్చు మాత్రమే ఇల్లు కట్టుకునే వారికి పడుతుందన్నారు. భవన నిర్మాణ కార్మిక కార్మికులకు కూడా ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, బెదిరింపులు ,అక్రమ ఆర్జన, ప్రజా ధనమంతా వృధా కావడం జరిగిందన్నారు.. ఈ ఐదు సంవత్సరాలలో మరింత ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధి బాటలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. కందిపప్పును కేజీ 160 రూపాయలకు, బియ్యం కేజీ 49 రూపాయలకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ తో పాటు ఎమ్మార్వో- రమేష్,సిఎస్ డి టి లక్ష్మీదేవి, నాయకులు డోలా రాజారెడ్డి, ఓబులేసు కోటి సూర్య బాబు, జిగ్గా చంద్రశేఖర్, అధిక సంఖ్యలో బిజెపి నాయకులు, అసోసియేషన్ నాయకులు బాలు, రాము, రాజా, వాసు శేషు, చందు తేజ , మళ్లీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img