Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

నాటక కళాకారులకు పట్టుచీరలు పంపిణీ చేసిన కలవల మురళీధర్

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కళాజ్యోతిలో ఈనెల 13వ 14వ తేదీలలో కళా జ్యోతి ఆధ్వర్యంలో కీర్తిశేషులు రామకృష్ణమాచార్యుల వర్ధంతి సందర్భంగా 140 సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్-సురభి జయచంద్ర వర్మ హైదరాబాద్ బృందం వారిచే భక్త ప్రహల్లాద పౌరాణిక నాటకం, పాతాళ భైరవి జానపద నాటకములు ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శన అనంతరం కళాభిమాని, సుకన్య సిల్క్స్-ధర్మవరం అధినేత కలవల మురళీధర్, కుమారుడు కలవల నాగ తేజ, కోడలు శర్వాణి, మనవడు కలవల మిహాను కళాకారుల యొక్క కృషిని గుర్తించి 15 మంది మహిళలకు పట్టుచీరలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలవల మురళీధర్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్-సురభి జై చంద్ర వర్మ హైదరాబాద్ విందాం వారు ఇటువంటి పౌరాణిక నాటికలను ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందని, మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను,కళాలను, భావితరాలకు అందించేందుకు సురభి జయచంద్ర వర్మ చేస్తున్న కృషి అభినందనీయమని, అటువంటివారిని తాను అభినందించడం, సన్మానించడం, మహిళలకు పట్టుచీరలు పంపిణీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇటువంటి కళాకారులను అభినందనలతో పాటు ప్రోత్సహించాల్సిన అవసరం అందరి మీద ఉందని వారు తెలియజేశారు. తదుపరి శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్ హైదరాబాద్ బృందం వారు కలవల మురళీధర్ కుటుంబానికి కృతజ్ఞతలను తెలియజేశారు. అదేవిధంగా కళాజ్యోతి కార్యదర్శి కార్యవర్గ సభ్యులు కూడా కలవల మురళీధరులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img