Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

బీజేపీకి సవాలు యూపీ ఉప ఎన్నికలు

ప్రదీప్‌ కపూర్‌

ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకంగా మారనున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుచుకున్న సీట్లను ఎలాగైనా నిలుపుకునేందుకు బీజేపీ నాయకత్వం గట్టిపోరాటమే చేయనుంది. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్‌, బీజేపీ నాయకత్వానికి అతిపెద్ద సవాలు. కర్హల్‌, మిల్కిపూర్‌, సిషామౌ, కక్తేరి, మజవాన్‌, కుందర్కి, ఖైర్‌, ఫుల్పూర్‌, ఘజియాబాద్‌, మీరాపూర్‌ పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. క్రిమినల్‌ కేసులో ఎస్పీ ఎమ్మెల్యే దోషిగా తేలడంతో ఒక స్థానం ఖాళీ కాగా, ఆయా ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నిక కావడంతో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘోర అపజయం చవిచూసిన నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలను పార్టీ హైకమాండ్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
ఓటర్ల సమీకరణ, పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు సుమారు డజనుకు పైగా మంత్రులకు వివిధ నియోజకవర్గాలను కేటాయించారు. బీజేపీి నాయకత్వం సంఫ్‌ు పరివార్‌లోని వివిధ విభాగాల పార్టీ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో పనిచేసేందుకు నియమించింది. వీరు అయా నియోజకవర్గాల్లోని అభ్యర్థుల ఎంపిక, ఇతర స్థానిక సమస్యల గుర్తింపు వంటి కార్యక్రమాలు చేపట్టేపనిలో ఉన్నారు.
ఇండియా కూటమి, సమాజ్‌వాదీ పార్టీ ప్రత్యేకించి బీజేపీలోని వెనుకబడిన వర్గాలను పెద్ద ఎత్తున ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ నియోజక వర్గ అవసరాలకు అనుగుణంగా టిక్కెట్‌ పంపిణీలో వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీ విభాగాల్లో అత్యంత చాకచక్యంగావిజయవంతంగా అమలు చేయడంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉపఎన్నికలు జరగనున్న 10 స్థానాల్లో బీజేపీ మూడు మాత్రమే గెలుపొందగా, ఒకటి ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు నిషాద్‌ పార్టీ, ఒకటి ఆర్‌ఎల్డీ గెలిచాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్‌ఎల్‌డి సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఉప ఎన్నికలకు వెళ్లే 10 అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాలను గెలుచుకున్న సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించడంతో మరింత ఉత్సాహంగా ఉంది. ఈ ఎన్నికల్లో అఖిలేష్‌ యాదవ్‌, రాహుల్‌ గాంధీ మధ్య సమన్వయం లోక్‌సభ ఎన్నికల సమయంలో కనిపించింది. ఇప్పుడు ఈ కూటమి ఉప ఎన్నికల్లోనూ, తర్వాత 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తుందని ఇద్దరు నేతలు ప్రకటించారు. మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం ప్రారంభించాలని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే పార్టీ నేతలను కోరింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ కనీసం మూడు స్థానాల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కూటమి భాగస్వామ్య భాగస్వామ్య పక్షమైన సమాజ్‌ వాదీ పార్టీతో ఈ వారంలో సీట్ల విషయమై పార్టీ నేతలు చర్చిస్తారని యూపీసీసీ అధ్యక్షుడు అజయ్‌ రాయ్‌ తెలిపారు.
మెయిన్‌పురిలోని కర్హాల్‌ అసెంబ్లీ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, బీజేపీకి చెందిన ఎస్పీ సింగ్‌ బఘేల్‌ను ఓడిరచి, లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి అఖిలేష్‌ యాదవ్‌ తన మేనల్లుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది. రెండు పర్యాయాలు సిట్టింగ్‌ ఎంపీ లల్లూ సింగ్‌ను ఓడిరచి అయోధ్య లోక్‌సభ స్థానంలో అద్భుతమైన విజయం సాధించి దేశాన్ని ఆశ్చర్యపరిచిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే అవదేశ్‌ పాసి ఖాళీ చేసిన మిల్కీపూర్‌ అసెంబ్లీ స్థానంలో మరో ముఖ్యమైన ఎన్నిక జరగనుంది. అయోధ్యలో ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు బీజేపీ ఈ సీటును ఎస్పీ నుంచి చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నుంచి బీజేపీపై తీవ్ర ఒత్తిడి ఉంది. నిషాద్‌ పార్టీ ఇప్పటికే రెండు స్థానాలపై తన విజయం ఖాయమని ప్రకటించింది. అలాగే ఆర్‌ఎల్‌డీ కూడా ఎక్కువ సీట్ల కోసం తీవ్ర యత్నం చేస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీజేపీి హైకమాండ్‌ అంతర్గత కుమ్ములాటలను, విధ్వంసాలను నిరోధించడానికి టిక్కెట్ల పంపిణీలో కూటమి భాగస్వాములతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దేశం యావత్తు యూపీలోని 10 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల ఫలితాలపై దృష్టిసారించింది. ఈ ఎన్నికల ఫలితాలు 2027 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img