Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

తల్లి పాలలో రోగ నిరోధక శక్తి లభిస్తుంది..

డిప్యూటీ డిఎంహెచ్వో సెల్వియా సల్మాన్, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి
విశాలాంధ్ర -ధర్మవరం : తల్లి పాలలో రోగ నిరోధక శక్తి లభిస్తుందని డిప్యూటీ డిఎంహెచ్వో సెల్వియా సా ల్మాన్, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు గర్భవతులకు తల్లిపాలు వారోత్సవములో భాగంగా వాటిపై చక్కగా అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం డాక్టర్. సెల్వియా సాల్మాన్, డాక్టర్ మాధవి మాట్లాడుతూ తల్లి యొక్క పాలు బిడ్డకు పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తుందని, అదే ఒకే ఒక జీవనాధారం అవుతుందని తెలిపారు. తల్లిపాలకు సరి రావు మరి ఇతర పాలు అని, కాబట్టి తల్లిపాలను ఏ విధంగానూ తక్కువగా చూడరాదని, మీ బిడ్డలకు ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చేది ఒకే ఒక తల్లిపాలు మాత్రమేనని తెలిపారు. తల్లిపాలకు ఎటువంటి ప్రత్యాన్నిమయం లేదని, తప్పనిసరిగా ప్రతి బిడ్డకు తల్లిపాలు అందేలా కుటుంబ సభ్యులు కూడా సహకరించాలని తెలిపారు. నవజాత శిశువు యొక్క మొదటి ఆహారమైన తల్లిపాలతోనే బిడ్డకు రోగ నిరోధక శక్తి సంపూర్ణ పోషణ లభించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా తల్లికి రొమ్ము గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని, మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే శిశువుకు సంపూర్ణమైన ఆహారం అవుతుందని తెలిపారు. తల్లిపాలు పిల్లల మేధస్సును మెరుగుపరచడంలో ఎంతగానో సహకరిస్తుందని తెలిపారు. తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం వలన అదనపు బరువు తగ్గడానికి సహాయపడుతుందని తెలిపారు. తల్లిపాలు శిశువును నిమోనియా అతిసారా వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కూడా కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నజీర్, డాక్టర్ శైలజ, డాక్టర్ వెంకటేశులు, డాక్టర్ హరి శ్రీనివాస్, హెల్త్ కౌన్సిలర్ వెంకటరమణమ్మ, బాలింతలు, గర్భవతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img