London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Monday, October 21, 2024
Monday, October 21, 2024

హసీనా పలాయనం

కొంప ముంచిన రిజర్వేషన్ల రగడ

. బంగ్లాదేశ్‌లో నాటకీయ పరిణామాలు
. రాజీనామా చేసి భారత్‌ చేరుకున్న బంగ్లా ప్రధాని
. రంగంలోకి సైన్యం… తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుపై ప్రకటన
. సంయమం పాటించాలని ఆందోళనకారులకు బంగ్లా సైన్యాధిపతి పిలుపు
. నిరసనకారుల సంబురాలు… ప్రధాని అధికారిక నివాసం ముట్టడి

ఢాకా : హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. నాటకీయ పరిణామాల నడుమ ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా భారత్‌ చేరుకున్నారు. మరోవైపు.. హసీనా ఢాకా విడిచిపెట్టారనే సమాచారం అందిన వెంటనే వేల మంది నిరసనకారులు ప్రధాని నివాసాన్ని చుట్టుముట్టి విధ్వంసకాండకు దిగారు. ఆ దేశ మాజీ ప్రధాని, హసీనా తండ్రి షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అయితే కాసేపటికే సైన్యం రంగప్రవేశం చేయడంతో వాళ్లంతా వెనక్కి తగ్గారు. ఆ తర్వాత సైన్యం పాలనను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు.. హసీనా దేశం విడిచి వెళ్లిపోయారని సైన్యం ప్రకటించగానే.. రోడ్ల మీదకు చేరిన లక్షల మంది నినాదాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపుల్లోకి వచ్చే దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని సైన్యం ప్రకటించింది. ‘‘మేం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. నిరసనల వల్ల ఈ దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. ఎన్నో ప్రాణాలు పోయాయి. ఈ హింసను ఆపాల్సిన సమయం ఇది. నా ప్రసంగం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను. పరిస్థితుల్లో మార్పు వస్తే.. ఎమర్జెన్సీ అవసరం ఉండదు’’ అని బంగ్లా సైన్యాధిపతి వాకర్‌-ఉజ్‌-జమాన్‌ పేర్కొన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ… ‘నేను (దేశం) అన్ని బాధ్యతలు తీసుకుంటున్నాను. దయచేసి సహకరించండి’ అని కోరారు. తాను వివిధ రాజకీయ పక్షాల నేతలను కలిశానని, శాంతిభద్రతల బాధ్యతను సైన్యం తీసుకుంటుందని చెప్పానని పేర్కొన్నారు. అయితే హసీనా అవామీ లీగ్‌ పార్టీకి చెందిన నాయకులు ఎవరూ సమావేశానికి హాజరు కాలేదు. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడిరచారు. నిరసనకారులు హింసామార్గాన్ని విడనాడాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆందోళన కారులపై తుపాకులు ఎక్కుపెట్టవద్దని సైన్యాన్ని ఆదేశించారు. అంతకు ముందు అవామీలీగ్‌ పార్టీ అధ్యక్షురాలు, ప్రధాని షేక్‌ హసీనా(76)కు సైన్యం అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. ఆమె పదవి నుంచి దిగిపోయేందుకు 45 నిమిషాల సమయం ఇచ్చినట్లు స్థానిక వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఆమె రాజీనామా చేసి… ఆమె సోదరితో కలిసి దేశం విడిచి వెళ్లిపోయినట్లు తెలిసింది. కాగా సీ-130 ట్రాన్స్‌పోర్ట్‌ మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఢాకా నుంచి త్రిపురలోని అగర్తలకు వచ్చిన ఆమె అక్కడి నుంచి దిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌ వద్ద ఉన్న హిండన్‌ ఎయిర్‌బేస్‌కు వచ్చినట్లు ఏఎన్‌ఐ వార్తాసంస్థ తెలిపింది. ఆమె దిల్లీలో ఉంటారా, లేదంటే లండన్‌ వెళ్తారా అనేది స్పష్టం కాలేదు. ఈ క్రమంలో దిల్లీలోని చాణక్యపురిలో ఉన్న బంగ్లాదేశ్‌ హై కమిషన్‌ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
రిజర్వేషన్ల వ్యవహారంలో బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. హింసాత్మక ఘర్షణలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఇప్పటిదాకా వందల మంది మరణించారు. ప్రధాని హసీనా రాజీనామా డిమాండ్‌తో నిరసనకారులు రోడ్డెక్కారు. గత రెండు రోజులుగా ఆ అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆదివారం ఒక్కరోజే వంద మంది వరకు మృతి చెందారు. ఈ నేపథ్యంలో.. ఆందోళనలు తీవ్ర ఉధృతం కావడంతో రాజీనామా ప్రకటనను జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ద్వారా చేయాలని హసీనా భావించారు. అయితే.. సైన్యం ఆమెకు అంత సమయం ఇవ్వలేదు. సోమవారం ఉదయం ఢాకాలోని ప్రధాని భవనం ‘గణభబన్‌’కు చేరుకున్న ఆర్మీ చీఫ్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌… రాజీనామా విషయంలో హసీనాకు 45 నిమిషాల డెడ్‌లైన్‌ విధించారని, సైన్యం సూచనల మేరకే ఆమె హెలికాఫ్టర్‌లో దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారని తెలుస్తోంది. కాగా ఇప్పటిదాకా నిరసనల్లో వందల మంది(300 మందికి పైగా అని అధికారిక సమాచారం) మరణించినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలపై హసీనా తనయుడు సజీబ్‌ వాజెద్‌ జాయ్‌ మాట్లాడుతూ… హసీనా రాజకీయ పునరాగమనం చేయరని చెప్పారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే ఆమె తన భద్రత కోసమే దేశం విడిచి వెళ్లిపోయారని తెలిపారు. బలవంతంగా అధికారాన్ని లాక్కోవడం మంచిది కాదంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశారాయన. అధికారాన్ని చేజిక్కించుకోవాలని యత్నించే ప్రతిఒక్కరినీ అడ్డుకోవాలని సైన్యాన్ని కోరారు.
భారత్‌ అప్రమత్తం: బంగ్లాదేశ్‌ పరిస్థితులపై భారత్‌ అప్రమత్తమైంది. చొరబాట్లు పెరిగే అవకాశం ఉన్నందున సరిహద్దులో నిఘా పెంచా లని సైన్యం నిర్ణయించింది. అంతకు ముందు.. భారత విదేశాంగశాఖ బంగ్లాలో ఉన్న భారతీయు లను అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ జారీ చేసింది. అయితే.. ఇప్పటికే చాలామంది భారతీయులు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.
పదిహేనేళ్లుగా పదవిలో…
గత పదిహేనేళ్లుగా బంగ్లా ప్రధాని పదవిలో షేక్‌ హసీనా కొనసాగుతున్నారు. 1996 జూన్‌లో తొలిసారి ఆమె ప్రధాని పదవి చేపట్టారు. ఆ తర్వాత 2009 నుంచి రాజీనామా దాకా ఆమె ప్రధానిగా కొనసాగారు. మొత్తంగా 20 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆమె.. సుదీర్ఘకాలంగా ప్రధాని పదవిలో కొనసాగిన బంగ్లాదేశ్‌ నేతగానే కాకుండా ప్రపంచంలోనూ తొలి మహిళా నేతగా ఘనత సాధించారు.
ఎందుకీ ఆందోళనలు?
1971లో జరిగిన బంగ్లాదేశ్‌ విముక్తి ఉద్యమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఆస్తులు పోగొట్టుకున్నారు. ప్రాణత్యాగాలు సైతం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రిజర్వేషన్ల విధానం తీసుకొచ్చింది. విముక్తి ఉద్యమంలో భాగస్వాములైన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే.. 2018లో ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా అలజడి సృష్టించారు. దాంతో అప్పటి ప్రభుత్వం దిగివచ్చింది. రిజర్వేషన్లను నిలిపివేసింది. స్వాతంత్య్ర సమరయోధుల బంధువుల విజ్ఞప్తి మేరకు రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ ఈ ఏడాది జూన్‌లో బంగ్లాదేశ్‌ హైకోర్టు తీర్పు ప్రకటించడంతో విద్యార్థులు మళ్లీ భగ్గుమన్నారు. రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలంటూ పోరుబాట పట్టారు. వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో షేక్‌ హసీనా ప్రభుత్వంలో కలవరం మొదలైంది. ఘర్షణల్లో విద్యార్థులు మరణిస్తుండడం, శాంతి భద్రతలు అదుపు తప్పుతుండడంతో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిజర్వేషన్లపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయకుండా, అన్ని రకాల రిజర్వేషన్లను 7 శాతానికి పరిమితం చేస్తూ తీర్పు వెల్లడిరచింది. ఇందులో 5 శాతం బంగ్లా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు, 2 శాతం ఇతరులకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. సుప్రీం తీర్పు తర్వాత పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్లే కనిపించినప్పటికీ… గత రెండ్రోజులుగా కొనసాగిన అల్లర్లు.. హింసాత్మక ధోరణిలో కొనసాగాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img