Friday, November 1, 2024
Friday, November 1, 2024

చేనేతల్ని కాపాడుకుంటేనే, ధర్మవరాన్ని కాపాడుకుంటాం…. పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర- ధర్మవరం : చేనేతలను కాపాడుకుంటేనే ధర్మవరాన్ని కాపాడుకోగలమని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కదిరి గేటు వద్ద గల చేనేత విగ్రహం కు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ చేనేతల ఆత్మహత్యలు లేని ధర్మవరాన్ని మీరు చూస్తారు అని,హ్యాండ్ లూమ్స్ ని బ్రతికించడమే మా ప్రథమ కర్తవ్యం అని తెలిపారు.గతంలో మగ్గం అంటే తెలియని వారికి నేతన్న నేస్తం వచ్చింది అని,ఈ ఐదేళ్లలో ఎన్నో మార్పులు చూస్తారన్నారు.ఈ కార్యక్రమంలో వందలాది మంది చేనేతలు,టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా చేనేత రంగానికి సేవలందించిన వారిని,చేనేత రంగంలో సుదీర్ఘ కాలంగా ఉన్న కార్మికులకు శ్రీరామ్ ఘనంగా సన్మానం చేశారు.ధర్మవరానికి చేనేతలతోనే గుర్తింపు వచ్చిందని,ఈ రోజు అదే నేతన్న ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలోనేఈసారి ఇలాంటి పొరపాట్లకు తావు లేకుండా చేస్తామన్నారు.ముఖ్యంగా చేనేతలకు,అలాగే వారికి అనుబంధంగా ఉన్న ప్రతి కార్మికునికి గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. తమ ప్రభుత్వం చెప్పిన విధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గుర్తింపు కార్డులు అన్నీ త్వరలోనే అమలవుతాయన్నారు.మంత్రి సత్యకుమార్ తో కలిసి చేనేతల్ని ఆదుకునే విధంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.ఆత్మహత్యల నివారణ,చేనేతల పిల్లలకు చదువులు,వారి కుటుంబాలకు ఆర్థిక సహకారం,ముడి సరుకు ధరలు తగ్గించే వంటి వాటిపై ఈ ఐదేళ్లలో అనేక నిర్ణయాలు ఉంటాయన్నారు.హ్యాండ్ లూమ్స్ ని కాపాడుకోవటమే తమ తొలి కర్తవ్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img