Saturday, November 2, 2024
Saturday, November 2, 2024

వర్గీకరణ కోసం పోరాడిన ఎమ్మార్పీఎస్, ఎం ఈ ఎఫ్ నాయకులకు సన్మానం

విశాలాంధ్ర- ధర్మవరం : ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు శుభ సందర్భంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు ఉద్యమం చేసినందుకు కోర్టు ద్వారా మంచి ఫలితాన్ని అందుకున్నందుకు మాదిగల అండ్ ఉపకులాలు సంతోషపడుతున్నారు. ఇందుకోసం శ్రమపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను రాష్ట్ర ఎంఏఎఫ్ నాయకులు ఉలవల నాగరాజు, ధర్మవరం నియోజకవర్గ అధ్యక్షులు లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి కొండప్ప తెలియజేశారు. ఈ సందర్భంగా వారు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం నిర్విరామంగా ఎన్నో అవమానాలకు కష్టాలను ఓర్చుకొని పోరాడునటువంటి జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్, ఎమ్మార్పీఎస్ నాయకులు భూ దప్ప, ఎం ఈ ఎఫ్, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. తదుపరి వారి సేవలను కొనియాడారు. అదేవిధంగా ఈ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారికి ఘనంగా నివాళులు కూడా అర్పించడం జరిగిందని తెలిపారు. ఈ వర్గీకరణ విజయోత్సవ ర్యాలీని త్వరలో నడుపుతున్నామని అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని విజయవంతం చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంఈఎఫ్ నాయకులు మల్లికార్జున, ఆర్టిసి సాకే ఆదినారాయణ, ధర్మవరం నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ శేషు, అనంతపురం ఎంఈఎఫ్ అధ్యక్షులు రమేష్, మీసాల నాగభూషణ, కొడవళ్ళ నారాయణస్వామి, బాలరాజు, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గజ్జల రామాంజనేయులు, మండల అధ్యక్షులు నాగరాజు, నారాయణ, పూజారి పెద్దన్న, కొట్టాల రమేష్, ఎం. నాగేంద్ర, తదితర ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img