Saturday, November 2, 2024
Saturday, November 2, 2024

ఖరీఫ్-2024 ఈ-పంట నమోదు కార్యక్రమం పై శిక్షణ…

జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు
విశాలాంధ్ర ధర్మవరం:: ఖరీఫ్-2024 ఈ పంట నమోదు కార్యక్రమం పై మండల కేంద్రంలో పట్టు శాఖ సహాయ సంచాలకులకు కార్యాలయ సమావేశ మందిరము నందు శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమానికి ధర్మవరం వ్యవసాయ డివిజన్లోని రామగిరి, కనగానపల్లి, సికె పల్లి, ధర్మవరం ,బత్తలపల్లి,
తాడిమర్రి, రైతు సేవా కేంద్ర సిబ్బందికి , మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఏ ఓ పంట సాగు చేసిన ప్రతి రైతుకు పంట నమోదు చేయాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం కూడా జియో ఫెన్సింగ్ విధానములో ఈ పంట నమోదు కార్యక్రమం చేపడుతుందని తెలియజేయడం జరిగిందన్నారు. ఎటువంటి తప్పిదాలకు అవకాశం లేకుండా సకాలంలో పంట నమోదు చేయాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు.
పంట నమోదు జరిగే గ్రామాలలో ప్రతిరోజు ఏఏ సర్వే నెంబర్లు, పంట నమోదు చేయుచున్నారో, రైతులకు ముందుగానే తెలియజేసి, పంట నమోదు చేయాల్సిందిగా తెలపడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ధర్మవరం కృష్ణయ్య , మండల వ్యవసాయ అధికారులు ఓబిరెడ్డి, రమాదేవి కృష్ణకుమారి ,మురళి, ముస్తఫా, ఏఈవోలు ఉపేంద్ర, రియాజ్ ,అశ్విని, రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొనడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img