వ్యవసాయాన్ని పరిరక్షించండి. ఏపీ రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. కాటమయ్య
ఉమ్మడి జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్ డి. దిల్షాద్
విశాలాంధ్ర- ధర్మవరం : బడా కంపెనీలను బహిష్కరించాలని వ్యవసాయాన్ని ప్రభుత్వాలు పరిరక్షిద్దే దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. కాటమయ్య, ఉమ్మడి జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్ డి. దిల్షాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు కార్మికుల దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమములో భాగంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్ళకు గంతలు కట్టుకొని తమ నిరసనను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బడా కార్పొరేట్ కంపెనీలను బహిష్కరించాలని, క్వీట్ ఇండియా రోజున బడా కార్పొరేట్ కంపెనీలను బహిష్కరించండి అన్న నినాదంతో నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది అని తెలిపారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ కంపెనీలకు రాయితీల్ని, రుణాలను మంజూరు చేసిందని, విమర్శించారు. వ్యవసాయ రంగంలో రైతులకు అనుకూలమైన రుణ విమోచన చట్టం, విత్తన చట్టం, స్వామినాథన్ కమీషన్ సిఫార్సులు అమలు చేయమంటే కనీసం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులని పది రెట్లు ఎక్కువగా అమ్ముతున్న బడా కార్పొరేట్ కంపెనీలకి అనేక రాయితీల్ని, రుణాల్ని ప్రజాధనాన్ని ఉదార స్వభావంతో అందిస్తున్నారని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం నోట్లో మట్టి కొడుతున్నారని నిట్టూర్చారు. బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టిన బడా కంపెనీలకి మళ్లీ రుణాలు మాఫీ చేసి, రుణాలు మంజూరు చేస్తున్నారని, బిజెపి పాలన బడా కార్పొరేట్ కంపెనీల అనుకూల పాలనగా, అనుకూల చట్టాలు చేసే ప్రభుత్వంగా తయారైందని ఎద్దేవా చేశారు. అన్ని వ్యవసాయ ఉత్పత్తి పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలనే డిమాండ్ ను నేటికీ నెరవేర్చలేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తరు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించే కంపెనీలు, అన్ని పంటల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే బడా కంపెనీలను దేశంలో నిషేధించాలని డిమాండ్ చేశారు. రైతుల్ని బడా కంపెనీలు దోపిడీ చేసి వారి రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయని ఆవేదన చెందారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం బడ్జెట్లో రైతులకు కార్మికులకు నిధులను తగ్గించి కార్పొరేట్లకు అనుకూలంగా ఉంటే చట్టాలను ఈరోజు తీసుకురావడం దారుణమన్నారు. కార్మికులకు సంబంధించిన 44 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ తీసుకువచ్చిన ఈ బిల్లులను అమలు చేయడానికి కూడా కేంద్రం పూనుకోవడం దారుణమని తెలిపారు. దీనివల్ల యజమానులకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా ఉండే ఈ లేబర్ కోడ్లను కూడా కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ కానీ కనీస మద్దతుగాని ప్రకటించకపోవడం మోసపూరిత చర్య అని విమర్శించారు. ఈ మధ్యకాలంలో కార్పొరేట్లకు దాదాపు 16 లక్షల కోర్టు కేంద్రం మాఫీ చేసిందని అదేవిధంగా రైతులకు ఎటువంటి రాయితీలు గాని ఇవ్వడం లేదని వారు దుయ్యపట్టారు. కేంద్రం రైతుల, కార్మికుల, పేదల యొక్క ధనాన్ని కార్పొరేట్లకు ఇస్తూ, వారికి యాక్షన్ కూడా 30 శాతం ఉన్న వాటిని 20 శాతంనకు తగ్గించిందని తెలిపారు. దీనివల్ల ధనవంతులు కార్పొరేట్ వాళ్లు అవుతున్నారని పేదలు, కార్మికులు, కర్షకులు ఇంకా కింది స్థాయికి దిగిపోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ జే వి. రమణ, కో కన్వీనర్ అయూబ్ కాన్, రైతు సంఘం జిల్లా నాయకులు శేషంపల్లి మారుతి, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కదిరప్ప, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు మహదేవ్, చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి, వెంకటనారాయణ, వెంకటస్వామి, రవికుమార్, ఏఐటీయూసీ నాయకులు రమణ, డబ్బు కళాకారుల సంఘం నాయకులు జంగమన్న, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు వెంకటేష్, ముకుంద,లక్ష్మీ ఓబులేష్ ప్రసాద్ చెన్నకేశవులు, సివిల్ సప్లై హమాలీ యూనియన్ నాయకులు కోటి, కదిరప్ప, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.