Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

‘మాతృ మరియు శిశు మరణాలు అరికట్టాలి

డా.ఈ బి .దేవి డి యం హెఛ్ ఓ

విశాలాంధ్ర అనంతపురం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ .బి దేవి అధ్యక్షతన గత మాసంలో జిల్లాలో జరిగిన 2 మాతృమరణాలు మరియు 19 శిశు మరణాలు కు గాను. 2 మాతృమరణాలు. 6 శిశు మరణాలు ను ర్యాండమ్ గ మరణాలు జరగడానికి గల కారనాలను ఆ ప్రాంత డాక్టర్స్ మరియు సిబ్బందితో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది .
ఈ సమీక్షా సందర్బంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి మాట్లాడుతూ..
మాతృమరణాలు శిశుమరణాలు నివారించాలని , ముక్యంగ శిశు మరణం కానీ మాతృ మరణం కానీ జరిగినప్పుడు మరణానికి ముందు ఏ రకమైన ఇబ్బందులు ఎదురైనాయి మరణానికి గల కారణాలు తెలుసుకొని. మరోసారి అలాంటికారణం తో మరణం జరగకుండా డాక్టర్స్ , సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలన్నారు . అలాగే. గర్భిణీ స్త్రీ డెలివరీ తరువాత కూడా తగిన జాగ్రతలు తీసుకోవాలని తెలిపారు ,
ఐ సి డి యస్. ప్రాజెక్టు వారు. గర్భిణీ స్త్రీ లకు అందించే న్యూట్రిషన్ ఫుడ్ ను వారు సంపూర్ణముగా తీసుకొనేలా చూసి. రక్త హీనతతో. బాధ పడకుండా చూడాలని ఆదేసించారు ,అలాగే మాతృ మరణం జరిగి నపుడు. జిల్లా నోడల్ టీం కూడా చేత్రస్థాయికి వెళ్లి విచారించాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీని 12 వారలు లోపు రిజిస్ట్రార్ చేసుకొని. ,ఆమెకు అన్నిరకాల వైద్య పరీక్షలు. వైద్యసేవలు అందించాలని కోరారు ,ఏ తల్లి ప్రసవ అనంతరం అధిక రక్తస్రావంతో మరణించ కూడదని , ప్రతి గర్భిణీ స్త్రీని పరీక్షించాలని. ప్రమాదకర లక్షణాలు వున్న గర్భిణీ స్త్రీల పట్ల తగిన జాగ్రతలు తీసుకొంటూ సుఖప్రసవం జరిగేలా చూడాలని ఆదేశించారు.
రక్త హీనత వున్నా ,గుండె సంబంధిత సమస్యలు వున్నా ,తక్కువ ఎత్తు ,,తల్లి గర్భం లో ఉమ్మనీరు తక్కవ వున్నా ,బిడ్డ పెరుగుదల లేకపోయిన , హై రిస్క్ గర్భవతులను గుర్తించి వారికీ ప్రత్యేక వైద్యసేవలు అందించాలని కోరారు
ఆశాడే రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రము డాక్టర్స్.వైద్య సిబ్బందికి. గర్భిణీ స్త్రీలకు ,, తల్లి మరియు బిడ్డ కు సంబందించిన ఆరోగ్యం ఫై అవగాహన కల్పించాలని ఆదేశించారు . శిశు మరణాలవిషయంలో కూడా తగిన జాగ్రతలు తీసుకోవాలన్న ఏ శిశు వు ఐన నెలలు నిండక పుట్టిన , లేదా తక్కువ బరువుతో పుట్టిన ,శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడుతున్న , యన్ ఆర్ సి లో చేర్పించి పిల్లల ఆరోగ్యం కాపాడాలన్నారు , మాల్ న్యూట్రిషన్ వల్ల ఏ శిశువు మరణించ కూడదన్నారు. పుట్టిన ప్రతి శిశువుకు గంటలోపు తల్లిపాలు తాగించాలన్నారు బుడ్డి పాలు తాగించడం మంచిది కాదన్నారు. ప్రతి తల్లి శిశువుకు పాలిచ్చు టెక్నిక్స్ తెలుసుకోవాలన్నారు. అంతిమంగా ఏ శిశువు జన్మిస్తూ మరణించ కూడదు ఏ తల్లి జన్మనిస్తూ మరణించ కూడదని తెలిపారు .
ఈ సమావేశంలో డి సి హెఛ్ యస్ డా పాల్ రవికుమార్. డా యుగంధర్ డి ఐ ఓ ,ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి డాక్టర్స్ డా .నవీన్ కుమార్ ,డా శంకర్ నారాయణ. యం పి హెఛ్ ఈ ఓ లక్ష్మన్న , ఎం పి హెఛ్ యస్ హేమలత , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img