విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : స్థానిక వి ఎస్ ఎస్ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇంటర్మీడియట్ చదువుతున్న, విద్యార్థి రాహుల్ ఏలూరు జిల్లా పెదవేగి లో జరిగిన సెపక్ తక్ర రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని, కళాశాల కరస్పాండెంట్ వి ఎస్ ఎన్ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు, క్రీడా పోటీలలో కూడా తమ సత్తాను చూపి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థినికి తెలిపారు. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం , ఎంతో గర్వకారణం అని స్వామి పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి రాహుల్ ని ప్రత్యేకంగా అభినందించారు.