Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Thursday, October 3, 2024
Thursday, October 3, 2024

లేబర్, టెక్స్‌టైల్స్ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ కేంద్ర లేబర్, టెక్స్‌టైల్స్ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. అనంతపురం పార్లమెంట్ సభ్యులుగా తొలిసారి ఎన్నికైన అంబికా లక్ష్మీనారాయణ ఇప్పటికే కేంద్ర ఒ బి సి మరియు సిల్క్ బోర్డు సంక్షేమ సభ్యులుగా ఉండగా, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన లేబర్, టెక్స్‌టైల్స్ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎంపీని నియమించడం జరిగింది. దీనితో ఎంపీకున్న బాధ్యతలు మరింత పెరిగాయి. లేబర్, టెక్స్‌టైల్స్ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ స్టాండింగ్ కమిటీకి బసవరాజు బొమ్మాయి చైర్ పర్సన్ గా నియామకం కాగా, కమిటీ సభ్యులుగా లోక్సభకు చెందిన 21 మంది ఎంపీలు ఉండగా, రాజ్యసభకు చెందిన పదిమంది ఎంపీలు ఉండగా, లేబర్, టెక్స్‌టైల్స్ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ స్టాండింగ్ కమిటీలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను సభ్యులుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర లేబర్, టెక్స్‌టైల్స్ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా అవకాశం కల్పించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img