Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Thursday, October 3, 2024
Thursday, October 3, 2024

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును కాపాడుకుందాం

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల అనంతపురంజిల్లా సమన్వయ సమితి పిలుపు
విశాలాంధ్ర -అనంతపురం : విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపాలని ఈనెల 1వ తారీకు నుండి మూడు రోజులు పాటు విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాల, ఆధ్వర్యంలో నిరసన దీక్షలు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిర్వహించారు. గురువారం రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలో ముందుగా లఖీంపూరీ కాల్పులఘటనలో మరణించిన రైతుకుటాంబాలకు నివాళులు అర్పించడము జరిగింది. ఈకార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల అనంతపురం జిల్లా సమితి కన్వీనర్ డి చిన్నప్ప యాదవ్ అధ్యక్షత వహించగా
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి( సిపిఐ) సి. మల్లికార్జున ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి (సిపిఎం) చంద్రశేఖర్ రెడ్డి,జిల్లా రైతు కూలి సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా రైతు కూలి సంఘంజిల్లా నాయకులు కృష్ణ పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శులు
సి. మల్లికార్జున ,చంద్రశేఖరెడ్డి మాట్లాడుతూ… విశాఖ ఉక్కు అనేది ఆత్మ బలిదానాలతో సాధించుకున్నది అటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గత నాలుగు సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తామని ప్రకటించినప్పుడు నుండి విశాఖ ఉక్కు కార్మికులు పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. వారికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది ఇప్పటికైనా విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయమని తక్షణమే కార్మికులకు స్పష్టమైన హామీ ఇవ్వాలి దాదాపుగా 4200 మంది కార్మికులను తొలగించినామని గందరగోళమైన ప్రకటనలు చేస్తూ కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్న బిజెపి ప్రభుత్వం కుటిల రాజకీయాలు మా నుకోవాలన్నారు. ఇప్పటికైనా విశాఖ ఉక్కుకు సొంత గనులు ఏర్పాటుచేయాలిని ,విశాఖ ఉక్కును ఎస్ ఏ ఐ ఎల్ లో కలిపేంతవరకు పోరాటాలు కొనసాగిస్తామని విశాఖ ఉక్కు పోరాట కమిటీ తరపున ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి విశాఖ ఉక్కును పరిరక్షించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం పైన ఉందన్నారు. గతంలో ఎన్నికల ముందు హామీలను ఒకసారి ఆత్మవిమర్శచేసుకోవాలి లేకుంటే ఆంధ్ర ప్రజలు ఈ కూటమిప్రభుత్వాన్ని క్షమించరని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కౌలురైతుసంఘము జిల్లాప్రధానకార్యదర్శి బాలరంగయ్య,విశాఖ ఉక్కు జిల్లా జాయింట్ కన్వీనర్ రైతుకూలిసంఘముజిల్లానాయకులు రాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు నాగేష్, వెంకటరాముడు, బండి వెంకటరాముడు, పండ్ల తోట రైతు సంఘం జిల్లాఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు, రాముడు రాజశేఖర్ శెట్టి,రామంజి, శ్రీనివాసులు, మాధవరెడ్డి, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img