కఠినచర్యలు తీసుకుంటున్నా ఆదుపుకాని అక్రమార్కులు
విశాలాంధ్ర శింగనమల : మండల వ్యాప్తంగా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు, రాత్రి వేళల్లో అక్రమార్కులు దొంగ చాటుగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు, శింగనమల సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలుట్లయ్య ఇసుకాసురులపై ఉక్కు పాదం మోపుతున్ననూ, సంపాదనే ధ్యేయంగా ఇసుక నమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు, అక్రమ ఇసుక తరలిస్తున్న టిప్పర్లకు ట్రాక్టర్లకు అపరాధ రుసుమును మాత్రమే చెల్లిస్తూ పోలీసులు పట్టుకున్న టిప్పర్లను, ట్రాక్టర్లను విడిపించుకొని షరా మామూలుగానే అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, మండల పరిధిలోని జూలా కాలువ వంక నుండి రాత్రి సమయాల్లో అక్రమంగా క్రాసింగ్ మీద ఇసుక తరలిపోతోందని, అందువల్ల పరిసర గ్రామాల్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇసుకాసురులపై తగిన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు,