విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో
శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె.తేజోత్స్న గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పామిడి మండలం లోని సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు తప్ప హాజరుకావాలని పేర్కొన్నారు.