జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం రేడియో స్టేషన్ లో గురువారం ఉదయం 7:45 గంటల నుంచి 8:15 గంటల వరకు ఆకాశవాణి అనంత మిత్ర ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలో భారీ వర్షాల కారణంగా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలతో సంభాషించారు. వారి సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, హార్టికల్చర్ డిడి నరసింహారావు, ఏపీఎంఐపీ పిడి రఘునాథరెడ్డి, హార్టికల్చర్ ఏడి ఫిరోజ్ ఖాన్, ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.