కేసు నమోదు చేసిన రెడ్డప్ప
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని దుర్గా నగర్ లోని బైలు ప్రాంతంలో రాబడిన రహస్య సమాచార మేరకు 11 మంది పేకాటరాయులను అరెస్టు చేయడం జరిగిందని టూటౌన్ సిఐ రెడ్డప్ప తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ దుర్గా నగర్ బయలు ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు రహస్య సమాచారం అందగా సిబ్బందితో అక్కడ వెళ్లి దాడి చేయడం జరిగిందని తెలిపారు. ఆ దాడిలో 11 మందిని అరెస్టు చేసి వారి ద్వారా 11 సెల్ ఫోన్లను, నగదు రూ.1,16,750 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు. తదుపరి వీరందరిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపడం జరిగిందని తెలిపారు.