London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Wednesday, October 23, 2024
Wednesday, October 23, 2024

కార్పొరేట్ల గుప్పెట్లో మీడియా

. ఎజెండాలకు అతీతంగా ప్రజాపక్షం దినపత్రిక
. ప్రముఖ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి

విశాలాంధ్ర`హైదరాబాద్‌: హిందుత్వవాదాన్ని, మతవిభేదాలను రెచ్చగొట్టడమే దేశంలో ప్రధానస్రవంతి పత్రికల లక్ష్యంగా మారిందని ప్రముఖ సంపాదకులు కె.రామచంద్రమూర్తి విమర్శించారు. మంగళవారం ప్రజాపక్షం పత్రిక ఆరవ వార్షికోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కమ్యూనిస్టు భావజాలం సజీవంగా ఉన్నంతకాలం దేశానికి హిందూమతోన్మాద ప్రమాదం ఉండదన్న ప్రముఖ పాత్రికేయుడు, కాలమిస్టు అనీస్‌జంగ్‌ అభిప్రాయాలను కె.రామచంద్రమూర్తి పునరుద్ఘాటించారు. ప్రగతిశీల భావాలను ప్రతిబింంచే కమ్యూనిస్టుపార్టీలే మోదీకి పూర్తిస్థాయిలో హిందువుల ఓట్లు పడకుండా అడ్డుకున్నాయని గుర్తుచేశారు. దేశ ప్రధాన స్రవంతి మీడియా భ్రష్టుపట్టిందని, ఛానల్స్‌ అమ్ముడుపోయా యనీ, కార్పొరేట్‌శక్తుల గుప్పెట్లో చిక్కుకున్న మీడియా పెరుగుతున్న ధరలు, మైనారిటీల అణచివేత, వివక్ష, మణిపూర్‌లో ఎడతెగనిహింస వంటి సమస్యలను వదిలిపెట్టేసిందని విమర్శిం చారు. వార్తా ప్రచురణ, సమస్యలను ప్రతిబింబించడంలో ఒకప్పుడున్నస్వేచ్ఛను పత్రికాసంపాదకులు క్రమంగా కోల్పోవడం వల్ల పత్రికలు ప్రజాసమస్యలకు దూరమవు తున్నాయన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇష్టాగోష్ఠిచేసిన ప్రముఖ పాత్రికేయులు దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యలపై ప్రశ్నించకుండా వ్యక్తి ఆరాధన పెంచేవిధంగా ప్రశ్నలు వేయడమే ఇందుకు ఉదాహరణ అని, ఆ సమయంలోనే మోదీ తనను తాను దైవాంశ సంభూతుడుగా అభివర్ణించుకు న్నారని గుర్తుచేశారు. మహిళల సమస్యలపై మోదీని నిలదీసిన వైట్‌హౌస్‌ రిపోర్టర్‌ సబ్రినా సిద్ధిఖీని ఆ తర్వాత కాషాయసైన్యం వేధింపులకు గురిచేసిందని గుర్తుచేశారు. పార్టీలవారీగా విడిపోయిన పత్రికలు ప్రజాసమస్యలను ప్రతిబింంచడం లేదని విమర్శించారు. ఈ పూర్వరంగంలో ప్రజాపక్షం’ దినపత్రిక మతోన్మాదానికీ, ఎజెండాలకు అతీతంగా అన్నిరకాల వార్తలూ ప్రచురిస్తూ ప్రగతిశీల భావాలను ప్రతిబింబిస్తూ ప్రజాచైతన్యం కోసం కృషి చేస్తోందన్నారు. ప్రజాపక్షం’ పత్రిక భావజాల ఔచిత్యం, చెల్లుబాటు ఈనాటికీ, ఏనాటికీ కూడా చెక్కుచెదరదన్నారు. వ్యక్తులు నడిపే యూట్యూబ్‌ ఛానళ్లకు లక్షలాదిమంది వీక్షకులు తయారయ్యా రన్నారు. ఒక మంచి పత్రికను నడిపేందుకు ప్రజా విరాళాల సేకరణ తప్పుకాదని, ప్రజాపక్షం’ వంటి పత్రికలు ఆర్థిక పరిపుష్ఠి సాధించి ముందుకు సాగాలని కె.రామచంద్రమూర్తి ఆకాంక్షించారు. నవచేతన విజ్ఞాన సమితి అధ్వర్యంలో నాగోల్‌ బండ్లగూడలోని గిరిప్రసాద్‌ భవన్‌’లో మంగళవారం సాయంత్రం ప్రజాపక్షం పత్రిక ఆరవ వార్షికోత్సవాలు జరిగాయి. నవచేతన విజ్ఞాన సమితి అధ్యక్షుడు పల్లా వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో సీపీఐ జాతీయ సమితి కార్యవర్గసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు చాడ వెంకటరెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌ కె.శ్రీనివాసరెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్రసమితి కార్యదర్శి, శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు ఆత్మీయ అతిథులుగా హాజరై ప్రసంగించారు. ప్రజాపక్ష దినపత్రిక సంపాదకులు మక్కెన సుబ్బారావు ముఖ్యఅతిథి కె.రామచంద్రమూర్తిని సభకు పరిచయం చేశారు. 2018లో ప్రారంభమైన ప్రజాపక్షం’ పత్రికను కంటికి రెప్పలా కాపాడుతున్న పార్టీ నాయకత్వానికీ, సిబ్బందికీ ఆయన శుభాకాంక్షలూ, అభినందనలూ తెలియజేశారు. కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సామాజిక న్యాయం కోరే ప్రజాపక్షం వంటి భావజాల పత్రికకు మార్కెట్‌ వ్యవస్థలో ప్రోత్సాహం ఉండదని, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో తప్ప ఆర్థికబలంతో ఇలాంటి పత్రికలు నడవడం లేదన్నారు. సిద్ధాంతానికి కట్టుబడి జర్నస్టులు స్వేచ్ఛగా పనిచేయగలిగేది ఇలాంటి పత్రికలలోనేనన్నారు. పత్రికలపై పాఠకులు, ఇతరులు చేసే ఫిర్యాదులను పరిశీంచేందుకు, సమస్యల పరిష్కారానికి స్వాతంత్య్రానంతరం ఏర్పడిన దేశ అత్యున్నతమైన చట్టబద్ధ సంస్థ ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం దిగజార్చిందని విమర్శించారు. సెంట్రల్‌ అక్రెడిటేషన్‌ కమిటీ ఎంపిక ప్రక్రియను ఉల్లంఘించారని, లౌకికవాదాన్ని ప్రశ్నించేవారు తయారయ్యారన్నారు. 1952లో ఏర్పడిన వర్కింగ్‌ జర్నలిస్టుల చట్టానికి అనుగుణంగా ఉన్న వేతన వ్యవస్థ విధానాన్ని తొలగించారని, వర్కింగ్‌ జర్నలిస్టుల చట్ట ప్రత్యేకతను నీరుగార్చి లేబర్‌ కోర్టుకు తెచ్చి మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ల స్థాయికి దిగజార్చారని విమర్శించారు. పదేళ్లుగా దేశంలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను క్రమపద్ధతిలో అర్థం చేసుకోడానికి అవకాశం లేని రీతిలో నిర్వీర్యం చేశారని, ఇక న్యాయవ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ దశలో పత్రికలు గతంలో లాగా కాకుండా ఎంతో సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. ముఖ్యంగా దేశ యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని వామపక్ష ప్రగతిశీల భావాలను అన్వయింపజేసే వార్తలను, వార్తాకథనాలను వ్యాప్తిలోకి తీసుకురావాలని, అప్పుడే పత్రిక ఆశయం సిద్ధిస్తుందని శ్రీనివాసరెడ్డి కోరారు.
ప్రతివ్యక్తీ శాస్త్రీయ దృక్పథంగల
పత్రికలు చదవాలి: కూనంనేని
కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మతం పేరుతో మారణహోమం జరగకూడదంటూ అవినీతిని, మతోన్మాదం ముప్పును వెలుగులోకి తెచ్చి సమాజమంటే ఇలా’ ఉండాలని తెలియజెప్పే ప్రజాపక్షం వంటి పత్రికలు ఇంకా మిగిలే ఉన్నాయని అన్నారు. చాలా పత్రికలలో పనిచేసే సిబ్బంది వామపక్ష భావజాలం ఉన్నవారేననీ, వారు లేకపోతే రాజ్యహింస పేట్రేగి ఇంకా కొనసాగుతుందన్నారు. సాయిబాబాకు జరిగిన అన్యాయాన్ని చీకటిలో కాంతిరేఖలా ప్రజాపక్షం వంటి పత్రికలే వెలుగులోకి తెచ్చాయన్నారు. ఏ మతం వారైనా ప్రజల్లో రాజ్యాంగస్ఫూర్తిని నింపేవి పత్రికలేనన్నారు. ప్రతి ఒక్కరూ ఒక గంటసేపు పత్రికలు ముఖ్యంగా శాస్త్రీయదృక్పథంగల వామపక్ష పత్రికలను అధ్యయనం చేయాలని, అప్పుడే ప్రతివ్యక్తీ సమాజానికి వెలుగురేఖగా మారతారన్నారు. ప్రతి మనిషిలో ఉండే ప్రశ్నించే గుణానికి దిశ, దశ, సైద్ధాంతిక మార్గాన్ని ఇచ్చేది ప్రజాపక్షం పత్రికేనన్నారు. పత్రిక లేకపోతే విజ్ఞానవ్యాప్తి జరగదని, విజ్ఞానం లేనివారు సమాజంలో అభ్యుదయవాదులుగా మనజాలలేరన్నారు. స్వయంగా తాను విశాలాంధ్ర’ పత్రిక అధ్యయనం ద్వారా ఒక కార్యకర్తగా, నాయకుడుగా ఎదిగానన్నారు. ప్రజాపక్షం’ పత్రికలో రాసే ప్రతివాక్యం, ప్రతివార్తా, ప్రతి కథనం ప్రజల కోసమేనని, ఆస్తులు అమ్ముకుని ఎన్నో త్యాగాలు చేసి మన పెద్దలు విశాలాంధ్ర’ వంటి వామపక్ష ఉద్యమ పత్రికలను నడిపించారని, ప్రజాపక్షం పత్రిక అదేతీరుగా అభివృద్ధి చెందుతుందన్నారు.
ప్రజాపక్షం’ పత్రిక గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను ప్రతిబింబించాలని, పత్రికకు మరింత పదును పెట్టాలని, అందుకోసం ఇంకా విశేషమైన కృషి జరగాలని చాడ వెంకటరెడ్డి అన్నారు. పాలకవర్గం పట్టుదల, సిబ్బంది సంకల్పశుద్ధి వల్ల పత్రిక నిలదొక్కుకుని ముందుకు కొనసాగుతోందన్నారు. నవచేతన విజ్ఞాన సమితి, పత్రిక ఆవిర్భావం కోసం పార్టీ నాయకులు చేసిన కృషిని ఆయన గుర్తుచేశారు. క్రియాశీల కార్యాచరణ ద్వారా తిరుగులేని ప్రజాపక్షంగా పత్రికను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. నవచేతన విజ్ఞాన సమితి కార్యదర్శి బీఎస్‌ఆర్‌.మోహన్‌రెడ్డి, కోశాధికారి వి.రత్నాకరరావు, జనరల్‌ మేనేజర్‌ ఎన్‌.మధుకర్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌ జిఎం వి.మదన్‌, పత్రిక కార్యనిర్వాహక సంపాదకుడు బొమ్మగాని కిరణ్‌ కుమార్‌ తదితరులు వేదికపై ఆశీనులయ్యారు. ప్రజాపక్షం’ దినపత్రిక ప్రకటనల విభాగం జనరల్‌ మేనేజర్‌ వి.మదన్‌ తొలుత సభకు స్వాగతం పలికారు. బొమ్మగాని కిరణ్‌ కుమార్‌ వందన సమర్పణ చేశారు.
ప్రజానాట్యమండలి గాయకుడు పల్లె నర్సింహ రచించిన ప్రత్యేకగీతాన్ని ఆయన ఆలపించారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు ఈటి నర్సింహ, కార్యవర్గసభ్యులు రవీంద్రాచారి, ప్రేమపావని (ఏఐటీయూసీ), సదానంద్‌గౌడ్‌, కరుణాకర్‌రెడ్డి (ఎస్‌టీయూ), నళిని (ప్రజానాట్యమండలి), వి.చెన్నకేశవరావు (సీఆర్‌.ఫౌండేషన్‌), కేవీఎల్‌ (ఐప్సో), సీపీఐ హైదరాబాద్‌ నగర కార్యదర్శి ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు. కె.రామచంద్రమూర్తిని నవచేతన విజ్ఞాన సమితి గవర్నింగ్‌ బాడీ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. శ్రీనివాసరెడ్డిని గవర్నింగ్‌ బాడీ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్‌ సత్కరించగా, కూనంనేని సాంబశివరావును గవర్నింగ్‌ బాడీ సభ్యులు కలవేన శంకర్‌ సత్కరించారు. మరో గవర్నింగ్‌ బాడీ సభ్యురాలు ఎన్‌.జ్యోతి… చాడ వెంకటరెడ్డిని శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ప్రజాపక్షం’ పత్రిక సంపాదకులు మక్కెన సుబ్బారావును గవర్నింగ్‌ బాడీ సభ్యులు వీఎస్‌బోస్‌, బీఎస్‌ఆర్‌ మోహన్‌రెడ్డి శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img