లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు.. జానీ మాస్టర్‌కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే గత రెండు వారాలుగా చంచల్గూడా జైల్లో ఉన్నారు జానీ మాస్టర్.జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఓ యువతి.. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. బాధిత యువతి పిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు.. జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ పరిణామం తరువాత జానీ మాస్టర్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరికి ఆయన గోవాలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.