Thursday, October 24, 2024
Thursday, October 24, 2024

ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు

–ట్రైనీ డిఎస్పి ఉషశ్రీ, సిఐ మస్తాన్ వలి
–పోలీస్ స్టేషన్లో ట్రైనీ డీఎస్పీ ఎన్.ఉషశ్రీ శిక్షణ

విశాలాంధ్ర- ఆస్పరి (కర్నూలు జిల్లా) : ప్రభుత్వం ఉచితంగా అందజేసే ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐ మస్తాన్ వలి లు హెచ్చరించారు. ఆస్పరి మండలం అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ లో ట్రైనీ డీఎస్పీ ఎన్.ఉషశ్రీ రెండు నెలల పాటు శిక్షణ పొందేందుకు గురువారం స్టేషన్ కు వచ్చారు. ఈ రెండు నెలలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా విధులు నిర్వహించనున్నారని ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నిర్వహించే రికార్డులు నిర్వహణ ఏ విధంగా నిర్వహించేది, వాటిని ఎప్పటికప్పుడు జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఎలా అప్డేట్ చేయాలో కంప్యూటర్ రైటట్ తో మాట్లాడారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో కేసుల నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ట్రైనీ డిఎస్పి ఎన్.ఉష శ్రీ, సిఐ మస్తాన్ వలీలు మాట్లాడుతూ మండలంలో ఇసుక రీచ్ పాయింట్ లను ప్రభుత్వం ఎక్కడా ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందజేసే ఇసుకను అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వెంగలాయదొడ్డి చెరువు, పుప్పాలదొడ్డి, యాటకల్లు, డీ.కోటకొండ, బైలుపత్తికొండ తదితర గ్రామాల వంక ప్రాంతాలలో ఇసుక తవ్వకాలను నిషేధించామని, అక్కడ ఎలాంటి తవ్వకాలు జరిపినా చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. తహసీల్దార్లు, వీఆర్యోలు, మహిళా పోలీసులు అక్రమాలు జరగకుండా పర్య వేక్షించాలన్నారు. అదేవిధంగా స్థానిక అవసరాల నిమిత్తం ఉచిత ఇసుకను తరలించేందుకు రెవిన్యూ, పంచాయితీ అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఉచిత ఇసుక సరఫరాపై ఫిర్యాదులు చేసేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన టోల్‌ఫ్రీ నంబరు 18004256042 ను వినియోగిచుకోవాలని వారు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img