Thursday, October 24, 2024
Thursday, October 24, 2024

పి ఎం సురక్ష, జీవనజ్యోతి బీమా యోజన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర- అనంతపురం : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలైన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన పథకాలు మారుమూల గ్రామాలలోని ప్రతి ఒక్కరికి సద్వినియోగం చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో లీడ్ బ్యాంకు మేనేజర్, వివిధ బ్యాంక్ కోఆర్డినేటర్స్, డిఆర్డిఏ, పంచాయతీ రాజ్, నాబార్డ్, ఫిషరీస్, పశుసంవర్ధక అధికారులతో ప్రత్యేక డి.ఎల్.సి.సి సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలైన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన . అక్టోబర్ 15, 24సం నుండి జనవరి 15, 25సం వరకు అమలవుతున్న పథకాలను ప్రతి గ్రామపంచాయతీలోని మారుమూల ప్రజలైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా సంబంధిత శాఖల సమన్వయంతో కృషి చేయాలన్నారు. దీనికి సంబంధించి ప్రతివారం నివేదికలు పంపించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. జిల్లాలో నవంబర్ 19 లోగా మీకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయు విధంగా వివిధ బ్యాంక్ కోఆర్డినేటర్స్, సంబంధిత అధికారులు నివేదికలు రూపొందించుకొని లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం అర్హత 18-50 సంవత్సరాలు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో ప్రీమియం: 436/సంవత్సరానికి చెల్లించాలని, బీమా మొత్తం : 2 లక్షలు (మరణ ప్రయోజనం) వర్తిస్తుందని తెలిపారు. (ప్రమాద బీమా) అర్హత: 18-70 సంవత్సరాలు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాత ప్రీమియం : 20/సంవత్సరానికి బీమా మొత్తం: 2 లక్షలు (ప్రమాద మరణం/వైకల్యం)వర్తిస్తుందని తెలిపారు. రెండు పథకాలు ప్రభుత్వ-మద్దతు గల బ్యాంకుల ద్వారా సాధారణ నమోదు ప్రక్రియ పొదుపు ఖాతా నుండి ప్రీమియం యొక్క ఆటో-డెబిట్ చేసుకోవచ్చన్నారు. అకాల మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు కుటుంబాలకు ఆర్థిక రక్షణ పొదుపు మరియు ఆర్థిక లాభం చేకూరే విధంగా ఉంటుందని తెలిపారు.
ఈ సమావేశ అనంతరం లీడ్ డిస్టిక్ ఆఫీస్ అనంతపురం వారి ఆధ్వర్యంలో  జిల్లాలో గ్రామస్థాయి జన సురక్ష కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వం బీమా పథకాలు మరియు 3 మంత్ సాటరషన్ కాంపెయిన్ ఫర్ జానసురక్ష స్కీమ్స్ అనే పోస్టర్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎల్డిఎం నరసింహారావు, డి.ఆర్.డి.ఏ పి.డి ఈశ్వరయ్య, ఫిషరీస్ డిడి శ్రీనివాస్ నాయక్, నాబార్డ్ డీడీఎం అనురాధ, పశుసంవర్ధక శాఖ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, వివిధ బ్యాంక్  కోఆర్డినేటర్స్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img