Thursday, October 24, 2024
Thursday, October 24, 2024

ఘనంగా సినీ హీరో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు

.ప్రభాస్ డై హార్స్ ఫ్యాన్స్ సుధాకర్, అంకే రామంజి.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సిరి హీరో ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ వారు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా 200 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు పండ్లు, పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధర్మవరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు అంకె రామాంజి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభాస్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించడం మాకెంతో సంతోషంగా తృప్తిగా ఉందని తెలిపారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. సినీ హీరో ప్రభాస్ ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిమానులు అసూ, మనీ, షాహిద్, తేజ, వంశీ, పవన్, వర్ధన్, వినయ్, మారుతి, మధు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img