Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

ప్రజల భద్రతకు భరోసా…

విజిబుల్ పోలీసింగ్

విశాలాంధ్ర అనంతపురం : జిల్లాలో ప్రతీరోజు సాయంత్రం వేళల్లో పోలీసులు చేస్తున్స విజిబుల్ పోలీసింగ్ వల్ల ప్రజల భద్రతకు భరోసా కల్గుతోంది. ప్రతీ రోజూ చేపట్టే ఫుట్ పెట్రోలింగ్, వాహనాల తనిఖీలతో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, శాంతి భద్రతల పరిరక్షణ సుగమమవుతోంది. జిల్లాలో ఉన్న 42 పోలీసు స్టేషన్ల పరిధుల్లోను గడచిన 24 గంటలలో విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు.
గంజాయి, తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యం నాశనం కావడం, ప్రాణాలు పోవడం, తదితర అనార్థాలను ప్రజలలో అవగాహన చేయడం కోసం జిల్లాలో ఉన్న 42 పోలీసు స్టేషన్ల పరిధుల్లో ఆయా పోలీసులు113 కార్యక్రమాలు చేపట్టారు.
మట్కా, పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఉరవకొండ యు.పి.ఎస్ , యల్లనూరు పోలీసులు వేర్వేరుగా దాడులు నిర్వహించి మట్కాకు సంబంధించి 02 కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి నుండీ రూ. 33,900/- నగదు సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 156 ఏటిఎం కేంద్రాలను చెక్ చేసి భద్రతపై సమీక్షించారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img