సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణకు ఇన్సాఫ్ నగర ప్రధాన కార్యదర్శి ఎస్పీ ఖాజా హుస్సేన్ వినతులు
విశాలాంధ్ర -అనంతపురం : వక్స్ సవరణ బిల్(2024) కు వ్యతిరేకత తెలపాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణకు ఇన్సాఫ్ నగర ప్రధాన కార్యదర్శి ఎస్పీ ఖాజా హుస్సేన్ బుధవారం స్థానిక సి పి ఐ పార్టీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు మైనారిటీల సంక్షేమ నిమిత్తం “దుల్హన్ పతకం” ఇమామ్, మౌజాన్ లకు గౌరవ వేతనం, మసీదు మరియు మదరస మరమ్మతులకు నిధుల కేటాయింపు కోసం ప్రత్యేక నిధులు ఇచ్చే వారన్నారు. మన ఆంధ్ర ప్రదేశ్ లో మైనారిటీలు దారిద్ర్య రేఖ కంటే దిగువ లో ఉన్న వారు చాల పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. అట్టి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా విరివిగా రుణాలు, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే వారు కానీ ఇప్పుడు మరల అధికారం లో వచ్చిన తరువాత పైన తెలిపిన సంక్షేమాలు మరుగున పడ్డాయన్నారు. మైనారిటీలలో ఎంతో మంది ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారన్నారు. వారికి విదేశీ విద్య అందని ద్రాక్ష లాగ ఉందన్నారు. మైనారిటీ విద్యార్థులకు విదేశీ విద్య కు ప్రాముఖ్యత చాలా అవసరము అని పేర్కొన్నారు. మీరు, రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు తో ఈ విషయం గురించి చర్చించి తక్షణమే మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట వేయవలసిందిగా డిమాండ్ చేయవలసిందిగా కోరడం జరిగిందన్నారు. గత కొన్ని నెలల ముందు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ” వక్స్ అమెండ్మెండ్ బిల్” కు వ్యతిరేకత తెలపాలని కోరుతున్నామన్నారు. భారతదేశంలోని వక్స్ ఆస్తిని కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలని మరియు ముస్లిం చట్ట ప్రకారం పవిత్రమైన, మతపరమైన లేదా స్వచ్ఛందంగా పరిగణించబడే ప్రయోజనాల కోసం వక్స్ను కదిలే లేదా స్థిరాస్తి యొక్క ఎండోమెంట్గా నిర్వచిస్తోంది అన్నారు. సమాజంలో విభజనను సృష్టించేందుకు వక్స్ చట్టాన్ని సవరించే బిల్లును బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తుందని పేర్కొన్నారు. అలాంటి చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకత తెలపాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మీరు వక్స్ సవరణ బిల్లును తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరచాల్సిందిగా కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ గౌరవ అధ్యక్షులు కు. అల్లి పీరా, అధ్యక్షులు కె. చాంద్ భాషా, హాజీ వలి, సద్దాం ,ఖాజా మొహిద్దీన్, మదార్ వలి తదితరులు పాల్గొన్నారు.