– పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసిన చోడవరం జనసేన పార్ట్ ఇంచార్జ్ పి.వి. ఎస్.ఎన్.రాజు …..
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.01.11.2024ది. అనకాపల్లి జిల్లాలోని చోడవరం సహకార చక్కెర కర్మాగారం (గోవాడ) నుండి పౌరసరఫరాల శాఖకు చక్కెర కొనుగోలు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను విశాఖపట్నంలో కలసిన జనసేన చోడవరం నియోజక వర్గ ఇన్చార్జి పి.వి. ఎస్.ఎన్.రాజు వినతి అందజేశారు. మంత్రి హోదాలో విశాఖలో మొదటి పర్యటన సందర్భంగా మంత్రి తో జనసేన నేతలు సమావేశమయ్యారు. మంత్రి ని కలిసిన వారిలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, పి.వి.ఎస్.ఎన్.రాజు వున్నారు. ఈ సమావేశంలో చోడవరం నియోజకవర్గంలోని పలు కీలక ప్రజా సమస్యలపై చర్చ జరిగింది.
ప్రజా సమస్యలు, ప్రస్తుత పరిస్థితి తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ చోడవరం చక్కెర కర్మాగారాన్ని ఆదుకోవడానికి తన నిబద్ధతను తెలియజేశారు. నియోజకవర్గ రైతుల భాదలపై తనకు పూర్తి అవగాహన ఉందని, చక్కెర కొనుగోలు కోసం పౌరసరఫరాల కార్పొరేషన్‌కు అవసరమైన ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
చోడవరం నియోజకవర్గం నందు ప్రజలు ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ పరంగా అన్నిరకాలుగా అండగా ఉంటామని మంత్రి తెలియ చేసారు.
ఎన్నో సంవత్సరాల నుండి జనసేన పార్టీ తరపున చోడవరం నియోజకవర్గంలో అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కారానికి మంతి మనోహర్ తెలిపిన స్పందనకు, భరోసాకు నియోజకవర్గ ప్రజల తరపున పి.వి.ఎస్.ఎన్.రాజు కృతజ్ఞతలు తెలియచేసారు.