ఏఐటీయూసీ 105 వ ఆవిర్భావ దినోత్సవ ర్యాలీ
విశాలాంధ్ర -అనంతపురం : 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 44 చట్టాలను కొనసాగించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ 105 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అనంతపురము నగరంలో ఏఐటీయూసీ అనుబంధ యూనియన్ల వద్ద జెండాలు ఆవిష్కరణలు నిర్వహించి అనంతరం నగర పాలక సంస్థ కార్యాలయం నుండి టవర్ క్లాక్ సర్కిల్ వరకూ కార్మిక ప్రదర్శన నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా రాజారెడ్డి మాట్లాడుతూ… భారత దేశానికి బ్రిటీష్ వారి నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించడం కోసం 1920 అక్టోబర్ 31 న ముంబాయ్ నగరంలో ఏఐటీయూసీ స్థాపించబడిందన్నారు.27 సం,లు బ్రిటీష్ వారి పాలనలో ఓక వైపు స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ ఇంకోవైపు కార్మిక చట్టాలను సాధించిన దేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని పేర్కొన్నారు. 105 సంవత్సరాల్లో ఏన్నో చారిత్రక మైన పోరాటాలు ఏఐటియుసి నిర్వహించిందన్నారు. ఇప్పటి ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు పరిష్కరించట్లేదన్నారు,కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలన్నారు. కనీస వేతనాలు అమలు ప్రకటనలకు మాత్రమే పరితమయ్యాయి తప్పా ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. కార్మిక చట్ట సవరణలు నిలుపుదల చేయాలని అనేక ఆందోళనలు,సమ్మెలు నిర్వహించినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు,బిజెపి ప్రభుత్వం ఈ పది సంవత్సరాల్లో ఓక్క సంస్థ స్థాపించకపోగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తోందన్నారు. ప్రభుత్వాలు అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలనే ఆలోచనే చేయకపోవడం సిగ్గుచేటన్నారు. అసంఘటిత కార్మికులను ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు, ఆటో,హమాలీ,వీధివ్యాపారస్తులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేష్ గౌడ్ గారు, నగర ప్రధాన కార్యదర్శి వి.కె కృష్ణుడు, నగర అధ్యక్షులు జి.చిరంజీవి,జిల్లా ఆఫీస్ బేరర్లు సి.రాజు, మల్లికార్జున,శ్రీనివాసులు,నాగవేణి, ఇబ్రహీం లు పాల్గొనడం జరిగింది.జెండా ఆవిష్కరణలు అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి కృష్ణ కళామందిర్ వరకు వందలాది కార్మికులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు వేణుగోపాల్, శివకృష్ణ నాగేంద్రబాబు ప్రసాద్,ఎర్రప్ప,మాధవ, రామాంజనేయులు, బాలు,రఫీ, హసేన్,శివ, హమాలి యూనియన్ నాయకులు అక్బర్ వలి,ధనుంజయ,రాము, నారాయణ బాబు, నాగరాజ్ షేక్షావలి,రాంబాబు, ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు కృష్ణా నాయక్,నరసింహులు,భారతి, మెడికల్ యూనియన్ నాయకులు మనోహర్,వెంకటేష్, శోభ,అంజలి, లారీ డ్రైవర్స్ యూనియన్ నాయకులు వెంకటేష్,మురళి,లక్ష్మీపతి అన్ని రంగాల కార్మికులు తదితరులు పాల్గొనడం జరిగింది.