Friday, November 1, 2024
Friday, November 1, 2024

గురుదాస్ దాస్ గుప్తా ఆశయాలను యువ కమ్యూనిస్టులు పునికిపుచ్చుకొని పనిచేయాలి

కామ్రేడ్ గురుదాస్ దాస్ గుప్తా 5 వ వర్ధంతి
విశాలాంధ్ర- అనంతపురం : గురుదాస్ దాస్ గుప్తా ఆశయాలను యువ కమ్యూనిస్టులు పునికిపుచ్చుకొని పనిచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ వర్ధంతి కార్యక్రమంలో పిలుపునిచ్చారు,
ఏఐటీయూసీ అగ్రనాయకులు గురుదాస్ దాస్ గుప్తా 5 వర్ధంతి కార్యక్రమం సిపిఐ కార్యాలయంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్… మాట్లాడుతూ గురుదాస్ దాస్ గుప్తా నిరంతరం కార్మిక హక్కుల కోసం పోరాడిన ఏకైన నాయకుడు,5 సార్లు లోక్ సభ,రాజ్యసభ సభ్యులుగా ఏన్నికై అనేక సమస్యలు పార్లమెంటులో లేవనెత్తారు అన్నారు. ,దేశాన్ని కుదిపేసిన 2జి స్పెక్ట్రమ్ కుంబకోనాన్ని వెలికితీసి పార్లమెంటులో పోరాటం చేసిన నాయకులు గుప్తా జీవిత కాలమంతా 4 జతల బట్టలతోనే దేశమంతా తిరిగిన నిరాడంబర నాయకుడు అన్నారు. ఆయన ఆఖరి జీవితంలో ప్రభుత్వం నుండి వచ్చిన ఫెక్షను కూడా పేద ప్రజల అవసరాలకు ఇచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ… కార్మికుల హక్కులను సాధించడంలో ఎన్నో పోరాటాలు నిర్వహించి లాటీ దెబ్బలతో తగిలిన రక్తపు గాయాలతోనే పార్లమెంటుకుపోయి,సమస్యలు పరిష్కరించాలని పోరాటం చేసిన మహనీయుడు,5 సార్లు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి ప్రధానమంత్రులతోనే గొప్ప పార్లమెంటేరయన్ గా గుర్తింపు పొందిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఏఐటీయూసీ లో ఆఖరి క్షణం వరకూ పనిచేసి ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం అక్టోబర్ 31 న మరణించిన కార్మిక నాయకుడు,ఆయన ఆశయ సాధనలో పనిచేయాలన్నారు.
ఈ కారియక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి,ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రానాయక్,సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు,సహాయ కార్యదర్శి అల్లీపీరా,ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు పార్వతి ప్రసాద్,పద్మావతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్ళాయి స్వామి,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్,నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు,నగర అధ్యక్షులు చిరంజీవి,ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున,అధ్యక్షులు రాజు,ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవేణి,ఎలక్ట్రిసిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం,లారీ యూనియన్ అధ్యక్షులు వెంకటేష్,హమాలీ యూనియన్ కార్యదర్శి అక్బర్,నాగరాజు,స్కూల్ వర్కర్స్ నాయకులు రఫీ,ఆటో యూనియన్ కార్యదర్శి కృష్ణానాయక్,దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img