దేశంలో వడ్డీ రేట్లు కొంత కాలంగా గరిష్ట స్థాయిలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను 2022-23 మధ్య కాలంలో వరుసగా వడ్డీ రేట్లను 4 శాతం నుంచి ఏకంగా 250 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. దీంతో అన్ని బ్యాంకులు వెంటనే ఈ భారాన్ని కస్టమర్లపైకి మళ్లించాయి. లోన్లపై వడ్డీ రేట్లను పెంచేశాయి. అంటే హోం లోన్, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్ వంటి వాటిపై ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి వచ్చింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో దీనిని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను గరిష్ట స్థాయిలోనే ఉంచేశాయి. చాలా కాలంగా తర్వాత వరుసగా 10 సమావేశాల్లోనూ స్థిరంగానే ఉంచుతూ వచ్చింది. ఇటీవల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను చాలా కాలం తర్వాత తగ్గించినప్పటికీ.. ఆర్బీఐ మాత్రం వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచింది.