Monday, April 22, 2024
Monday, April 22, 2024

ఎట్టకేలకు తెరుచుకున్న అంగన్వాడి కేంద్రాలు

విధులలో చేరిన అంగన్వాడి కార్యకర్తలు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- ఎట్టకేలకు అంగన్వాడీ కేంద్రాలు చేరుచుకున్నాయి. వైకాపా అధినేత పాదయాత్ర సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ గడచిన 43 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె అంగన్వాడీల సంఘం నాయకులు ప్రభుత్వంతో జరిపిన చర్చలలో పురోగతి కనిపించడంతో సంఘం నాయకుల సూచనల మేరకు అంగన్వాడీలు సమ్మెను విరమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అంగన్వాడి లు బుధవారం నుండి విధులలో చేరారు. దీంతో ఎట్టకేలకు అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకున్నాయి. అంగన్వాడి చిన్నారులతో కేంద్రాలు కళకళలాడాయి. లంబసింగి అంగన్వాడి కార్యకర్త సరమండ కుమారి, ఆయా సరోజిని అంగన్వాడి కేంద్రం ద్వారా గర్భిణీలు, బాలింతలకు తమ శాఖ ద్వారా అందించే పోషణ సరుకులను పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img