Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్ధులు పోటికి సిద్దం

భారత్ ఆదివాసీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు నీలకంఠం

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్ధులు పోటికి సిద్దమని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ఆరికే నీలకంఠం అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఆదివాసీల సమస్యలపై గళమెత్తడానికి ఏర్పడిన భారత్ ఆదివాసీ పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటి చేస్తుందని, తెదేపా, జనసేన, బిజెపిల కూటమికి,వైకాపాకి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఉన్న 7 గిరిజన నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంట్ స్థానాలకు పోటి చేయడానికి పార్టీ నిర్ణయించిందన్నారు, త్వరలో అభ్యర్ధులను ప్రకటిస్తామని, అధికార వైకాపా, కూటమిలు దొందూ దొందేనన్నారు. కేంద్ర, రాష్ట్రాలలో ఆదివాసీల సమస్యలను గాలికొదిలేసిన అధికార బిజెపి, వైకాపాలకు ఓటు వేసి ఆదివాసీలు మరింత నష్టపోవద్దని పిలుపునిచ్చారు. ఆదివాసీల సమస్యలపై నిత్యం పోరాటం చేసే ఆదివాసీ జెఏసి అండదండలతో భారత్ ఆదివాసీ పార్టీ ఎన్నికల బరిలో దిగుతుందని, ఈ పోరాటం ఆదివాసి పార్టీ, ఆదివాసేతర పార్టీలకు మధ్య జరుగుతుందన్నారు. ప్రభుత్వాన్ని నడిపే ఆదివాసేతర పార్టీలు ఆదివాసీల నియోజకవర్గాలలో గెలిస్తే ఈ ప్రాంతంలో ఉన్న ఖనిజసంపద, సహాజ వనరులు దోచుకుని పోవడానికి ప్రయత్నాలు చేస్తాయని, అదే ఆదివాసీ పార్టీ గెలిస్తే ఖనిజ సంపద, సహజ వనరులను కాపాడుకోగలమన్నారు. ఖనిజ సంపద, సహజ వనరులు అన్యాక్రాంతం కాకుండా ఉండాలంటే భారత్ ఆదివాసి పార్టీకి ఆదివాసీల అండదండలు అవసరమన్నారు. భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఆదివాసీ హక్కులు, చట్టాలు సక్రమంగా అమలు చేయించుకునేందుకు, జిఓ 3 స్థానంలో షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియమకాల చట్టం తీసుకువచ్చేందుకు, బోయవాల్మీకులను, ఇతర కులాలను గిరిజన జాబితాలో చేర్చకుండా అడ్డు కోవడంతో పాటు ఆదివాసీల సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు డా.పి.రామక్రిష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు తెల్లం శేఖర్, ముక్కయ్య, మంగడు, రాష్ట్ర మహిళ నేత డా.సీతారత్నం, కార్యదర్శులు నిమ్మక అన్నరావు, తెల్లం రవిప్రసాద్, సుభక్రిష్ణదొర, అంజిరెడ్డి, అబ్బులుకోయ, కొండగొర్రి ధర్మరావు, కన్నపరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img