Friday, May 17, 2024
Friday, May 17, 2024

అక్రమ మద్యం కలిగి ఉన్నా, క్రయవిక్రయాలు చేపట్టిన కఠిన చర్యలు తప్పవు

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ రాజు

విశాలాంధ్ర – చింతపల్లి ( అల్లూరి సీతారామరాజు జిల్లా): – అక్రమ మద్యం కలిగి ఉన్నా, క్రయ విక్రయాలు చేసిన కఠిన చర్యలు తప్పవని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చింతపల్లి శాఖ ఇన్స్పెక్టర్ వై రాజు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ తమ శాఖ అల్లూరి జిల్లా ఉన్నతాధికారి ఎస్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ వివిఎస్ఎస్ శేఖర్ బాబు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం, స్థానిక సిబ్బందితో కలిసి జీకే విధి మండలం దారకొండ గ్రామంలో నిర్వహించిన దాడులలో 295 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు అందుకు బాధ్యులైన గ్రామానికి చెందిన నాగం శంకర్రావు నాగం దారాలు అనే ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సైలు శేఖరం, దస్తగిరి లతోపాటు స్థానిక ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img