Monday, April 22, 2024
Monday, April 22, 2024

సూపర్ సిక్స్ పథకాలతో భవిష్యత్తుకు “గ్యారంటీ”

తెదేపా పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి ఈశ్వరి

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చిన సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి కుటుంబ భవిష్యత్తుకు “గ్యారంటీ” అని ఆ పార్టీ పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిలో పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో తాజంగిలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి ఆ పార్టీ పాడేరు నియోజకవర్గం పరిశీలకు రాజమండ్రి నారాయణతో కలిసి వచ్చిన ఆమె తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ద్వారా అందించే సూపర్ సిక్స్ పథకాలను వివరించారు ఈ సందర్భంగా పలు కుటుంబాలకు బాబు షూరిటీ.. భవిష్యత్ గ్యారంటీ కార్డులను నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఆండ్రాబు లక్ష్మణ్, నాయకులు పరమేశ్వరరావు, గోసరెడ్డి సోమేశ్వరరావు, పురుషోత్తం, సుందర రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img