విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : పాలు సేకరణ ధర తగ్గించడాన్ని నిరసిస్తూ మండలంలోని నరసయ్యపేట పాల కేంద్రం వద్ద శనివారం పాడి రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ రోజురోజుకు పశుగ్రాసం ధరలు, కూలీ రేట్లు పెరిగిపోయి పాడి పరిశ్రమ నిర్వహణ కష్టతరంగా మారిందన్నారు. ఈ క్రమంలో పాల సేకరణ ధరను పెంచాలి కానే, పాలు సేకరణ ధర తగ్గించడం వల్ల పాడి రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. పాల సేకరణ ధరను గతంలో మాదిరిగానే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో నరసయ్యపేట పాడి రైతులు పాల్గొన్నారు