Friday, May 3, 2024
Friday, May 3, 2024

రా(చ)జకీయ పార్టీల్లో బలవంతపు చేరికలు ….

– ఓటర్లను ప్రలోభ పెడుతున్న అభ్యర్థులు …

– మొద్దు నిద్ర నటిస్తున్న అధికార యంత్రాంగం ….

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.20.04.2024ది. రానున్న సార్వత్రిక ఎన్నికలు వేళ ఎన్నికల సంఘం ఎన్ని నిభందనలు విధించినప్పటకి స్థానిక అధికార యంత్రాంగం మొద్దు నిద్ర నటిస్తుండటంతో పలు రా(చ)జకీయ పార్టీలు ఓటర్లను అనేక ప్రలోభాలకు గురి చేస్తూ, ప్రజల మనోభావాలపై ప్రభావితం చేస్తున్నాయని కార్మిక, కర్షక, ప్రజా మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. బూటకపు హామీలతో ” చేరికలు, స్వంత గూటికి ” అంటూనే వివిధ స్థాయి ప్రలోభాలతో ఓటర్లను ఒకే రోజులో పలు పార్టీలకు గెంతులు వేయిస్తున్నారన్నారు. ఉదయం చేరికలు, సాదర ఆహ్వానాలంటూ ఒక ఖండువా కప్పే నాయకుడు వుంటే, మధ్యాహ్నం మరొక ఖండువా తోను, సాయంత్రం స్వంత గూటికి అంటూ ఒకే విషయాన్ని పలు బూర్జువా, ప్యాకేజీ మీడియా లో వరుస కథనాలతో ఓటర్లతో మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలియజేసారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాల పై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్ని నిభందనలు విధించినప్పటికి స్థానిక అధికార యంత్రాంగం మొద్దు నిద్ర నటిస్తూ చూసి, చూడనట్లు నటిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే హేయమైన రాజకీయ పాలకులు, అందుకు సహకరిస్తున్న అధికార యంత్రాంగం పై తక్షణమే ఉన్నతాధికారులు ఈ.సీ. నిభందనలు ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, అనుభంద కార్మిక, కర్షక, ప్రజా, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img