విశాలాంధ్ర – పరవాడ( అనకాపల్లి జిల్లా); శిక్షా సప్తాహ్ నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా పరవాడ బాయ్స్ హై స్కూల్ లో గురువారం సాంస్కృతిక దినోత్సవాన్ని నిర్వహించారు. యలమంచిలి ఉప విద్యాశాఖాధికారి పి.అప్పారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్దులు భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల పట్ల అవగాహన ఏర్పరచుకోవాలని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే మన ప్రాథమిక సూత్రాన్ని అలవర్చుకోవాలన్నారు. వివిధ భాషలు, మతాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు కలిగిన భారతీయులు అందరూ ఒక్కటే (ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్) అనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్దులు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్.ఎమ్ బి.అప్పలనాయుడు, ఉపాద్యాయులు, సిబ్బంది విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.