Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం

విశాలాంధ్ర- ఉరవకొండ : గవిమఠం చంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకొని ఉరవకొండలో ఎస్‌ కే ఆర్‌ క్లబ్‌ వారు నిర్వహించిన జిల్లాస్థాయి షటిల్‌ కాక్‌ టోర్నమెంట్‌ లో గెలుపొందిన క్రీడాకారులకు గురువారం స్థానిక క్లబ్బులో ఉరవకొండ రూరల్‌ సీఐ బి.శేఖర్‌, ఎస్‌ఐ వెంకటస్వామి చేతుల మీదుగా నగదు బహుమతితో పాటు షీల్డ్‌ ను అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎస్‌ కే ఆర్‌ క్లబ్‌ వారు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులలో మానసిక ఉల్లాసాన్ని స్నేహ సంబంధాలను పెంచుతాయన్నారు. మూడు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో దాదాపు 30 టీములు పాల్గొన్నాయి. అనంతపురానికి చెందిన షటిల్‌ కాక్‌ క్రీడాకారులు అత్యంత ప్రతిభను కనబరిచి మొదటి, రెండవ బహుమతులను కైవాసం చేసుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్‌ కార్యదర్శి శివప్ప, ఉపాధ్యక్షులు నాగరాజు, మాట్లాడుతూ ఎస్‌ కే ఆర్‌ క్లబ్‌ తరఫున అనేక సేవా కార్యక్రమాలతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రథోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img