Friday, May 31, 2024
Friday, May 31, 2024

జిల్లా త్రో బాల్‌ జట్టుకు రాప్తాడు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు

విశాలాంధ్ర-రాప్తాడు : అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల జడ్పీహెచ్‌ఎస్‌ లో రెండు రోజులుగా జరుగుతున్న ఎస్జీఎఫ్‌ అండర్‌- 14, అండర్‌ -17 బాల బాలికల ఎంపికల పోటీలకు రాప్తాడు జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొని జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. అండర్‌- 14 బాలికల జట్టులో వై.భవిత, బాలుర జట్టులో టి. నరసింహ, అండర్‌-17లో బాలికల జట్టుకు జే.కీర్తన,బాలురు జట్టులో జె. రాజేష్‌ ఎంపికయ్యారని హెచ్‌ఎం బి.నరసింహులు, పీడీ ఎన్‌. కేశవమూర్తి తెలిపారు. వీరు అనంతపురము జిల్లా తరపున రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ క్రీడలలో పాల్గొంటారన్నారు. క్రీడాకారులు ఎంపికపై ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img