Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

దివ్యాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని రోటరీ క్లబ్ కార్యాలయం వద్ద శుక్రవారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 56 మంది మానసిక, శారీరక దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు అధ్యక్షుడు షాకీర్ భాష చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యం, మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ, ఉచిత ట్రై సైకిల్ తదితర ఎన్నో సేవలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ప్రతినెల 5వ తేదీన 400 రూపాయలు విలువచేసే నిత్యవసర సరుకులను పేదలకు పంపిణీ చేస్తుంద న్నారు. అలాగే పట్టణంలో ఇంకా ఎవరైనా దివ్యాంగులు ఉన్నచో తమకు సమాచారం తెలిపిన వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. రోటరీ క్లబ్ కార్యదర్శి కిషోర్, ఇస్మాయిల్, మద్దిలేటి, నాగేంద్ర,రఫీ, రమేష్, బాల సుబ్రమణ్యం, పీవీ సుబ్రహ్మణ్యం, రంగనాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img