Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తాం..

హిందూ ఐక్య సంఘాలు, బిజెపి వాటి అనుబంధ సంస్థలు
విశాలాంధ్ర -ధర్మవరం : భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని కోరుతూ గురువారం శ్రీరామనవమి సందర్భంగా హిందూ ఐక్య సంఘాలు, బిజెపి వాటి అనుబంధ సంస్థలు, శ్రీ అభయ హస్త ఆంజనేయ స్వామి సేవా కమిటీ తదితర సంఘాలు, పట్టణంలో బైక్ ర్యాలీతో పాటు, శ్రీరాముని విగ్రహాన్ని పట్టణ పురవీధులలో ఊరేగించారు. పెద్ద ఎత్తున యువతి, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ అన్న …నామస్మరణ పురవీధులలో మారు మ్రోగింది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మూడు గంటల పాటు, ఎండను కూడా లెక్కచేయకుండా శ్రీరామ నవమి పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఎక్కడా ఎటువంటి సంఘటనలు జరగకుండా వన్ టౌన్, టూ టౌన్ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. శ్రీరాముని విగ్రహానికి భక్తాదులు కూడా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిష్ రాజు, అన్నం లక్ష్మీనారాయణ, నిరంజన్ కుమార్, హరి, గడ్డం కుమార్, చిన్నూరు సోము, రుద్ర రవికుమార్ తోపాటు వందలాదిమంది ఐక్య హిందూ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img