Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

వైఎస్సార్ లా నేస్తం పథకం కింద జిల్లాలో 20 మంది లబ్ధి

విశాలాంధ్ర-పెనుకొండ : వైఎస్సార్ లా నేస్తం పథకం 2022 కింద 20 మంది అర్హులైన యువ న్యాయవాదులకు 15,35,000 రూపాయల నగదును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని ఏ జి పి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.అదేవిధంగా రాష్ట్రంలో ఃవైఎస్ఆర్ లా నేస్తంః నిధులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మొత్తం 2,011 మంది జూనియర్ న్యాయవాదులకు రూ.5 వేలు చొప్పున రూ.1 కోటి మొత్తాన్ని.. సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. యువ న్యాయవాదులకు లా నేస్తం ద్వారా నెలకు రూ.5 వేలు చొప్పున మూడున్నరేళ్లలో తాజా నిధులతో కలిపి.. 4,248 మందికి రూ.35.40 కోట్లు ఆర్థిక సాయం ప్రభుత్వం అందించిందని తెలిపారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కొత్తగా న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన యువ న్యాయవాదులకు, వారి వృత్తిలో స్థిరపడే వరకు మొదటి మూడు సంవత్సరాలపాటు నెలకు 5,000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. వైఎస్సార్ లా నేస్తం పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని, 35 ఏళ్ల లోపు వయస్సు మరియు తొలి మూడేళ్ల ప్రాక్టీస్ ఉండాలన్నారు.ఈ సందర్బంగా వైసిపి లీగల్ సెల్ జిల్లా ప్రధానకార్యదర్శి, సీనియర్ న్యాయవాది. భాస్కర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే శంకర్ నారాయణ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ వైఎస్సార్ లా నేస్తం పథకం ద్వారా అర్హులకు నెలకు రూ.5000 లు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.యువ న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎనలేనిదని,పేద కుటుంబాల్లోనీ యువ న్యాయవాదులు వృత్తిలో ఎదిగేందుకు వైఎస్సార్ లా నేస్తం పథకం ఎంతగానో ఉపయోగకరం అన్నారు.అదేవిధంగా న్యాయవాదుల సంక్షేమం కోసం కార్పస్ ఫండ్ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img