Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

జనవరి 24న బాలికా సంరక్షణ దినోత్సవ సందర్భంగా ఆర్డీవో సమీక్ష

విశాలాంధ్ర`అనంతపురం వైద్యం : స్థానిక ఆర్‌ డి ఒ కార్యాలయములో డివిజనల్‌ స్థాయి సమీక్షా సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారి ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆర్‌ డి ఒ మధుసూదన్‌ మాట్లాడుతూ… జనవరి 24 బాలికా సంరక్షణ దినోత్సవం సందర్భంగా చేపట్టవలసిన కార్యక్రమాల గురించి తెలిపారు. ఒకరు, ఇద్దరు ఆడ పిల్లలు కలిగి కుటుంబ నియంత్రణ పాటించని తల్లి దండ్రులకు గ్రామ పట్టణ స్థాయి ఆరోగ్య సిబ్బంది ద్వారా బాలికా ప్రాముఖ్యత ను ప్రజలకు వివరించి బాలికా సంతతిని కాపాడాలని తెలిపారు.అదే విధంగా బహిరంగ మందుల దుకాణాల్లో డాక్టరు సలహా మరియు డాక్టరు ప్రిస్క్రిప్షన్‌ లేకుండా అబార్షన్‌ మాత్రల విక్రయం పై చర్యలు తీసుకోవాలని గైనిక్‌ వైద్యులు కోరారు. డాక్టరు సలహా లేకుండా స్వతహాగా అబార్షన్‌ మాత్రల వాడకం వల్ల తల్లి కి కూడా ప్రాణాంతకం కావచ్చు అని అన్నారు. బాలికా సంరక్షణ కు పాఠశాల లు మరియు కళాశాల ల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో డా. మనోజ్‌ , డా.మూబిన్‌ తాజ్‌, డా. మనొరంజన్‌ రెడ్డి,డా.ప్రవీణ్‌, ఆర్‌ డి టి హెల్త్‌ డైరెక్టర్‌ సిర్రెప్ప,రెడ్స్‌ సంస్థ భానుజా, హెడ్స్‌ విజయకుమార్‌, ఓం ప్రకాష్‌ రెడ్డి ఏ పి ఆర్‌ ఒ , డిప్యూటీ డెమో త్యాగరాజు, సుబ్రహ్మణ్యం, వేణు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img