Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

మహిళ హక్కుల కోసం పోరాడుదాం…

మహిళా సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి పద్మావతి

విశాలాంధ్ర-గుంతకల్లు : నేటి సమాజంలో మహిళలకు జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలు మహిళల అనేక వాటి సమస్యల పై నిర్మూలన దిశగా మహిళ హక్కులను సాధించుకునేందుకు పోరాడుదామని మహిళా సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి పద్మావతి పిలుపునిచ్చారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బుదువారం పట్టణంలోని సీపీఐ కార్యలయంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మహిళా సమాఖ్య ఆద్వర్యంలో లౌకిక వాదాన్ని కాపాడండి మెజారిటీ బుజ్జగింపుల ధోరణిని ఓడించండి అనే నినాదంతో సదస్సును నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మహిళా సమాఖ్య నియోజకవర్గం కార్యదర్శి రామాంజనమ్మ అధ్యక్షతన వహించారు.ఈ సదస్సుకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సహాయ కార్యదర్శి పద్మావతి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పార్వతి ప్రసాద్,మండల సీఎస్ డీటి సుబ్బలక్ష్మి,ఏ ఎస్ ఐ మంజుల,గల్స్ హై స్కూల్ ఉపాద్యాయులు జ్యోతిలక్ష్మి,జ్యోతిశ్రీ హాజరైయ్యారు.ఈ సంధర్బంగా పద్మావతి మాట్లాడుతూ… మహిళలేనిదే సృష్టి లేదు దేశంలోనే సగభాగం ఉన్న మహిళలకు ఆనాడే మహిళా కార్మికులకు పని గంటలు తగ్గించాలని మహిళా కార్మికుల హక్కుల కోసం నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఓటు హక్కు స్త్రీ పురుషుల సమానత్వం బాల్య వివాహాల నిర్మూలన కోసం వితంతు వివాహాల కోసం సతీసహగనం ఆస్తి హక్కు నిర్మూలన కోసం మహిళా చట్టాల కోసం సాధించిన ఎంతోమంది మహనీయులలో క్లారా జెట్ కిన్ పోరాటం చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. కుటుంబ ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాలలో మహిళ అభ్యున్నతి కోసం అనుకూలమైన చట్టాలు పటిష్ట పరచాలని స్వేచ్ఛ సమానత్వం సాధికారత కోసం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ మహిళల పైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మహిళా రిజర్వేషన్ కోసం మద్యపాన నిషేధం కోసం పెరుగుతున్న నిత్యావసరాల ధరల కోసం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పటికీ జరుగుతున్న అఘాయుత్యాలను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ పాలన చేస్తూవుందన్నారు.ఈ నిరంకుశ పాలన నిర్మూలన కోసం మహిళలకు అండగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకురాలు సునీత ,మహిళ సమైక్య పట్టణ సభ్యులు శంషుబి ,శాంతమ్మ, గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img