Monday, May 20, 2024
Monday, May 20, 2024

వాడ వాడల ఇండియా కూటమి విస్తృత ప్రచారం

ప్రజల ఆరోగ్యం కోసం డంపింగ్ యార్డ్ తరలిస్తాం …
అనంతలో మౌలిక వసతులు కల్పించడమే మా లక్ష్యం…
ఇండియా కూటమి సిపిఐ అనంత అర్బన్ అభ్యర్థి జాఫర్

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంత ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం డంపింగ్ యార్డ్ ను తరలిస్తామని ఇండియా కూటమి సిపిఐ అనంత అర్బన్ అభ్యర్థి సి. జాఫర్ పేర్కొన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆజాద్ నగర్, నీలిమ థియేటర్, తదితర ప్రాంతాల్లో సిపిఐ నాయకులు కార్యకర్తలు విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ అభ్యర్థి సీ జాఫర్ మాట్లాడుతూ… వైయస్సార్ పార్టీ అనంత అర్బన్ అభ్యర్థి అనంత వెంకట్రాంరెడ్డి అధికారంలోకి రావడంతోనే మూడు నెలల్లో డంపింగ్ యార్డ్ ని తరలిస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే డంపింగ్ యార్డ్ పై ఉన్న చెత్తను తరలించకపోగా ఐదు సంవత్సర కాలంలో ఆ చెత్తపై కూడా అవినీతి కార్యక్రమాన్ని చేపట్టాడన్నారు. డంపింగ్ యార్డ్ కోసం గతంలో 18 ఎకరాల ముద్దలాపురం దగ్గర కార్పొరేషన్ పేరుమీద రాగే పరశురాం మేయర్ హయాంలో రిజిస్టర్ అయిందన్నారు. సిపిఐ పార్టీ అభ్యర్థిగా తాను అధికారంలోకి రాగానే డంపింగ్ యార్డును ముద్దలాపురం తరలించడమే మొదటి కర్తవ్యం గా పని చేస్తామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అనంతపురం బుక్కరాయసముద్రం చెరువుకు సంబంధించి 365 రోజులు నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఎప్పుడైతే నీరు చెరువులో ఉన్నట్లయితే దాదాపు మూడు డిగ్రీల ఎండ వేడిమి తగ్గడంతోపాటు భూగర్భలో నీటి శాతం పెరుగుతుందన్నారు. ప్రజలకు నీటి సమస్య లేకుండా ప్రణాళిక ద్వారా అందజేస్తామన్నారు. ఇప్పటివరకు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన అవినీతిని బయటపెడతామన్నారు. ఇండియా కూటమి తోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం ఓటర్లకు ఇండియా కూటమి సిపిఐ అనంత అర్బన్ అభ్యర్థి సి జాఫర్ కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి బలపరచాలని కోరారు. ఇండియా కూటమి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వి. మల్లికార్జున హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సవాయకారదర్శి పి. నారాయణస్వామి,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జే. రాజారెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు సీపీఐ నగర్ కార్యదర్శి శ్రీరాములు,సి.లింగమయ్య,పి. రామకృష్ణ, సీపీఐ నగర సహాయ కార్యదర్శి బి.రమణ, ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి జి.సంతోష్, ఏ టియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్. రాజేష్, నగర సహాయ కార్యదర్శి నాగరాజు, అల్లిపీర,ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుళాయి స్వామి, నగర కార్యవర్గ సభ్యులు ఎలుట్ల నారాయణ స్వామి, రామాంజి,చందు బాషా,గాధి లింగంప్పా,వి.కె.కృష్ణుడు, సుందర్ రాజు,మున్నా, ఏఐవైఎఫ్,ఏ.ఐ.ఎస్.ఎఫ్. సీపీఐ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img