Friday, April 19, 2024
Friday, April 19, 2024

రైతులుగా మీరు కంపెనీకి సహక రిస్తే ఉపాధి కలుగుతుంది

ఆర్డీవో తిప్పే నాయక్
విశాలాంధ్ర – ధర్మవరం : డివిజన్ పరిధిలోని చెన్నై కొత్తపల్లి మండలంలో ఇటీవల ప్రభుత్వం ఏపీఐఐసీఎస్ అనే కంపెనీని నిర్మాణం చేపడుతుంది. సర్వేనెంబర్ 433, 435, 436, 437, 500, 503 లలో దాదాపు 320 ఎకరాలలో ఈ కంపెనీ నిర్మాణం కావలసి ఉన్నది. 45 మంది రైతులు తమ భూములను ఇవ్వాల్సి ఉంది. ఇందుకు గాను రైతులుగా మీరు సహకరిస్తే తగిన ఉపాధి కలుగుతుందని ఆర్డీవో తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డీవో తిప్పే నాయక్ ఆధ్వర్యంలో చెన్నై కొత్తపల్లి మండలంలోని రైతులతో, రెవెన్యూ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో ఆర్డిఓ మాట్లాడుతూ ఇదివరకే మీకు నోటీసుల ద్వారా కంపెనీ యొక్క వివరాలను తెలియజేయడం జరిగిందని, రెండవసారి జరిగిన సమావేశంలో మీరు కంపెనీకి సహకరిస్తే భవిష్యత్తులో నిరుద్యోగ సమస్య తీరే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇందుకుగాను రైతులకు ఆర్డివోతో చాలా సేపు చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ఒక ఎకరాకు 35 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు పట్టుపట్టారు. కానీ చర్చలు జరిగిన, రైతులు సమతించకపోవడంతో ఆర్డీవో ప్రభుత్వం 25 లక్షలు మాత్రమే ఇవ్వగలరని వారు తెలిపారు. రైతులు మాట్లాడుతూ పూర్వీకుల నుండి తాము నమ్ముకున్న పొలంలోనే మా కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయని, నేడు ఓ కంపెనీకి మా పొలాలు ఇవ్వడం వలన మా జీవనము యొక్క మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని, ప్రస్తుతం మార్కెట్ ధరతో పోలిస్తే మేము అడుగుతున్నది అతి చిన్న సొమ్మేనని తెలిపారు.మా కష్టనష్టాలు తెలుసుకొని ఒక ఎకరాకు 35 లక్షలు ఇవ్వాలని వారు విన్నవించారు. కానీ ఇది నా పరిధిలో లేదని నా వరకు నేను రైతులకు న్యాయం చేశానని, ఇక కలెక్టర్ కు తన నివేదికను అందించిన తర్వాత, కలెక్టర్ సమక్షంలోనే రైతులుగా మీ సమస్యలు తెలుపుకొనవచ్చునని ఆడివో తెలిపారు. కలెక్టర్ కు రైతులు తెలిపిన విషయాలను తెలుపుతానని తెలిపారు. దీంతో రైతులు చేసేదిలేక వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమంలో డిఏఓ.. ఖతి జున్కుప్ర, అంపయ్య, సికేపల్లి తాసిల్దార్ సుబ్బలక్ష్మి, కంపెనీ జోనల్ మేనేజర్ మురళీమోహన్, సిఎస్ డీటి అనురాధ, వీఆర్వో తులసమ్మ, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img