Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

మాతా శిశు మరణాలు తగ్గించడంలో ఆశా కార్యకర్తలు కీలకం

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : మాతా శిశు మరణాలు తగ్గించడంలో ఆశా కార్యకర్తలు కీలకమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ . బి . దేవి,డిస్టిక్ ఇమ్మనైజేషన్ ఆఫీసర్ పి . యుగంధర్ తెలిపారు.
గురువారం ఆశ నోడల్ ఆఫీసర్స్ అందరికి రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డి ఐ ఓ హాజరు అయి కిల్కరి మొబైల్ అకాడమీ కి సంబంధించి గోడపత్రాలను రిలీజ్ చేయడం జరిగింది.
ఆశ నోడల్ ఆఫీసర్స్ ని ఉద్దేశించి డి ఐ ఓ మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలన్నారు. నవజాత శిశువుల గృహ సందర్శన చేసి కిట్లను ఉపయోగించి పిల్లల ఆరోగ్య పరిరక్షణ చేయాలన్నారు. ప్రతి ఆశా కార్యకర్త వారి పరిధిలో ఉన్న గర్భని బాలింతలు కౌమర బాలికలు ఎంతమంది ఉన్నారు వారి ఆరోగ్య పరిస్థితిలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి గర్భిణీకి01244588000 నెంబర్ నుంచి వాయిస్ కాల్ వస్తుందని ఒకవేళ ఫోన్ ఎత్తడం మిస్ అయితే 14423 కి మిస్సెద్ కాల్ ఇచ్చి మరలా డాక్టర్ అనిత సందేశాన్ని వినవచ్చు, మారు మూల ప్రాంతంలోనే గర్భణీ లకు భా లింతలకు అవగాహన పెరుగుతుందని, బిడ్డకు ఏడాది వయసు వచ్చేవరకు సేవలు అందుతాయి అన్నారు. ఈ విషయంపై తమ పరిధిలో ఉన్న గర్భ నెలకు విస్తృతంగా అవగాహన కలిపిచాలాన్నారు.
ఈ ఆశ యాప్ ఆశా కార్యకర్తలు, ప్రతిరోజు లాగిన్ అయ్యి, సర్వీసెస్ అన్ని ఈ ఆశ యాప్ లో ప్రతిరోజు అప్డేట్ చేయవలెను, అని తెలియజేశారు.
కిల్కరి సర్వీసెస్ గురించి గర్భిణులకు బాలింతలకు విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో కె ఎం ఏ రీజినల్ ప్రోగ్రాం అధికారి కీర్తి డీసీఎం శ్రీరాములు, హేమలత, మరియు ఆశ నోడల్ ఆఫీసర్ హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img