Monday, May 20, 2024
Monday, May 20, 2024

మానసిక అసమతుల్యత పై అవగాహన

విశాలాంధ్ర అనంతపురం వైద్యం : ప్రపంచ మానసిక అసమతుల్యతా దినోత్సవం సందర్భంగా మార్చి శనివారము, మానసిక విభాగమునందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు బైపోలార్ డిసార్డర్ గురించి దానికి గల కారణాలు లక్షణాలు చికిత్స మరియు నివారణ తీసుకోవలసిన జాగ్రత్తలు డాక్టర్ శారద, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ఇన్చార్డ్ హెచ్ ఓ డి వివరించినారు.ఆర్ ఎం ఓ హేమలత మాట్లాడుతూ… మానసిక వ్యాధులు గురించి అవగాహన ఎంతో అవసరం అని నర్సింగ్ విద్యార్థులకు, నర్సింగ్ స్టాఫ్ తప్పనిసరి అని తెలియజేశారు.
సూపర్టెంటెండెంట్/ అడిషనల్ డాక్టర్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ…. సమాజంలో మానసిక వ్యాధులపై అవగాహనని పెంచి వివక్షని తగ్గించడం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు. బై పోలార్ అంటే రెండు దశల లక్షణాలు ఉండటమే అని అందులో ఒకటి మేనియా, మేనియాలో విపరీతమైన ఎనర్జీ లెవెల్స్, గొప్పలు చెప్పడం, నిద్ర అవసరం లేదు అనుకోవడ, స్థాయికి మించిన ఖర్చు చేయడం, విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉంటాయని మరో దశలో డిప్రెషన్ నందు మేనియానికి వ్యతిరేకంగా ఎనర్జీ లేకపోవడం ఆత్మవిశ్వాసం లేకపోవడం నిద్రలేమి, ఆత్మహత్య ఆలోచనలు ఉంటాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో బై పోలార్ పోస్టర్ ని సూపర్డెంటెండెంట్ ఆవిష్కరించారు.
“బై పోలార్ డే ముఖ్య ఉద్దేశం సమాజంలో బైపీలర్ డే పై అవగాహన పెంచి వివక్షను తగ్గించడమే.” ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.వో డాక్టర్. పద్మజా, డాక్టర్. హేమలత, డాక్టర్. శారద అసోసియేట్ ప్రొఫెసర్ మరియు మానసిక విభాగ వైద్యులు నర్సింగ్ సూపర్డెంటెండెంట్, హెడ్ నుర్సులు, స్టాఫ్ నర్సులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img